తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Bold Comedy Movie: మగాడి జననాంగాన్ని కోసేస్తే.. ఓటీటీలోకి బోల్డ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Ondu Ghanteya Kathe OTT Streaming: ఇటీవల మోసం చేశాడని ప్రియుడి జననాంగాన్ని డాక్టర్ అయిన ప్రియురాలి కోసిన విషయం తెలిసిందే. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే వచ్చిన కామెడీ సినిమా ఓండు ఘంటెయ కథే. 2021లో విడుదలైన ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే వివరాల్లోకి వెళితే..
(1 / 8)
ఒండు ఘంటేయ కథ ఓటీటీ: నిజ జీవిత సంఘటనల ఆధారంగా 2021లో కన్నడ నాట తెరకెక్కిన సినిమా ఒండు ఘంటేయ కథ. దీని అర్థం ఒక గంట కథ అని. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రూపొందించిన ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చింది. కామెడీతోపాటు సందేశం ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది.
(2 / 8)
బెంగళూరుకు చెందిన ఓ యువతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడి జననాంగాలను నరికివేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో దర్శకుడు ద్వారకి రాఘవ్ సినిమాటిక్ యాంగిల్ తో తెరకెక్కించిన సినిమా ఓండు ఘంటెయ కథే.
(3 / 8)
కామెడీ యాంగిల్ తో దర్శకుడు రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నటుడు అజయ్ రాజ్ ప్లేబాయ్ రాహుల్ పాత్రలో నటించాడు. ఈ సినిమా మూడేళ్ల క్రితం విడుదలైంది. ఈ చిత్రం అడల్ట్ కామెడీ చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
(4 / 8)
అయితే ఈ సినిమా ఎట్టకేలకు మూడేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. జూలై 5 నుంచి నమ్మ ఫ్లిక్స్ ఓటీటీలో ఒండు ఘంటెయ కథే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. సినిమా చివర్లో పది నిమిషాల పాటు మంచి సందేశం కూడా ఉంటుంది.
(5 / 8)
అమ్మాయిలను ఏ విధంగానైనా మోసం చేయొచ్చని భావించే వారికి ఈ సినిమా ద్వారా దర్శకుడు ఓ సందేశం ఇచ్చారు.
(6 / 8)
ఓ యువకుడి జననాంగాలు పోయిన విషయం మీడియా, సోషల్ మీడియాకు తెలిస్తే ఏమవుతుందో సినిమాలో చూపించారు. ఆ అవయవం పోయిన వార్త పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారుతుంది. టీవీ జ్యోతిష్కులు కూడా దీనిపై టీవీలో చర్చించడాన్ని కామెడీగా చూపించారు.
(7 / 8)
ప్రకాష్ తుమ్మినాయుడుతో సహా కొందరు నటుల కామెడీ కూడా ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించే రీతిలో ఉంది. సినిమాలో గంటకు పైగా నాన్ వెజ్ జోకులు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు