Thangalaan First Review: విక్రమ్ తంగళాన్ ఫస్ట్ రివ్యూ.. రికార్డుల కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉండంటూ ట్వీట్-chiyaan vikram thangalaan movie first review in telugu thangalaan review by gv prakash kumar thangalaan first review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thangalaan First Review: విక్రమ్ తంగళాన్ ఫస్ట్ రివ్యూ.. రికార్డుల కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉండంటూ ట్వీట్

Thangalaan First Review: విక్రమ్ తంగళాన్ ఫస్ట్ రివ్యూ.. రికార్డుల కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉండంటూ ట్వీట్

Sanjiv Kumar HT Telugu
Jul 03, 2024 11:12 AM IST

Chiyaan Vikram Thangalaan First Review In Telugu: వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్ ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. ఈ సినిమాపై మొదటి రివ్యూను మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చారు. రికార్డుల కోసం రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.

విక్రమ్ తంగళాన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. రికార్డుల కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉండంటూ ట్వీట్
విక్రమ్ తంగళాన్ మూవీ ఫస్ట్ రివ్యూ.. రికార్డుల కోసం ఇండియన్ సినిమా రెడీగా ఉండంటూ ట్వీట్

Vikram Thangalaan First Review Telugu: తమిళంలోనే కాదు తెలుగులోను అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు చియాన్ విక్రమ్. సినిమా కోసం ప్రాణం పెట్టి మరి నటిస్తారు. పాత్రలోకి దూరిపోయేందుకు ఎంత రిస్క్ అయిన చేస్తారు. అందుకు పర్ఫెక్ట్ నిదర్శనాలే శివపుత్రుడు, అపరిచితుడు, ఐ మూవీలోని మేకవర్.

విభిన్న గెటప్

ఇప్పుడు మరో విభిన్న గెటప్పులో చియాన్ విక్రమ్ నటించిన సినిమానే తంగలాన్. చియాన్ విక్రమ్ నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీకి ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. రజనీకాంత్‌తో కబాలి, కాలాతోపాటు స్పారట్ట వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన పా రంజిత్ తంగలాన్‌కు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

తంగలాన్ ఫస్ట్ రివ్యూ

అంతేకాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా పాత్రల మేకోవర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇక విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించారని ఆ గ్లింప్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా తంగలాన్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.

రికార్డులకు రెడీగా ఉండు

తంగలాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. తంగలాన్ సినిమా గురించి రాసుకొచ్చారు. "అద్భుతమైన సినిమా. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇప్పటికే పూర్తి చేశాను. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ రాబోతుంది. రెడీగా ఉండండి. ఇండియన్ సినిమా రికార్డులకు రెడీగా ఉండు" అని జీవీ ప్రకాష్ ఎక్స్‌లో తెలిపారు.

వైవిధ్యం ఉన్నప్పటికీ

దీంతో తంగలాన్ సినిమా బాగుంటుందనే నమ్మకం చాలా కలిగింది. ఇక విక్రమ్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. నటనలో వైవిధ్యం ఉన్నప్పటికీ విక్రమ్ చాలా ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది. అందుకే విక్రమ్‌కు ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ పడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

35 కిలోలు తగ్గిన విక్రమ్

ఇక జీవీ ప్రకాష్ ట్వీట్‌కు తంగలాన్ ట్రైలర్ కోసం వెయిటింగ్ అని అభిమానులు, నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఎప్పుడూ పాత్రల కోసం ఎలాంటి కష్టమైన పడే విక్రమ్ తంగలాన్ కోసం 35 కేజీలు తగ్గారట. అలాగే ఇందులో విక్రమ్‌కు ఎలాంటి డైలాగ్స్ ఉండవని, సేమ్ శివపుత్రుడు మూవీలోని పాత్రలా ఉంటుందని, అందులోలాగే తంగలాన్‌లో అరుస్తానని ఓ ఇంటర్వ్యూలో హీరో చెప్పారు.

ఆగస్ట్ 15న రిలీజ్

తంగలాన్ సినిమా కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా. ఈ సినిమాను స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్‌లో విక్రమ్‌తోపాటు మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తంగలాన్ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ధ్రువ నక్షత్రం మూవీ

ఇదిలా ఉంటే, చియాన్ విక్రమ్ ఈ సినిమానే కాకుండా ధ్రువ నక్షత్రం అనే మరో మూవీ చేస్తున్నాడు. దీనికి డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తంగలాన్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తెలుగులో బడ్డీ అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోగా అల్లు శిరీష్ చేస్తున్నాడు. ఇటీవల బడ్డీ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

WhatsApp channel