Vikram: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో మలయాళం నటుడు.. 62వ చిత్రంగా వీర ధీర శూరన్
Vikram Veera Dheera Sooran Siddique: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినీ కెరీర్‌లో 62వ చిత్రంగా వస్తోన్న సినిమా వీర ధీర శూరన్. ఈ సినిమాలో మలయాళ పాపులర్ నటుడు సిద్ధికీ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
Malayalam Actor: విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్నో మరో లేటెస్ట్ మూవీ వీర ధీర శూరన్. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ 62వ చిత్రంగా వీర ధీర శూర తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఇటీవల ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన వీర ధీర శూర టైటిల్ టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ వెర్సటైల్ యాక్టర్ సిద్దికీ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఆయన పోస్టర్‌ను ఏప్రిల్ 21న విడుదల చేసింది.
మలయాళ నటుడు సిద్ధికీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో అంతిమ తీర్పు, నా బంగారు తల్లి, అగ్ని నక్షత్రం వంటి చిత్రాల్లో మెప్పించారు. రీసెంట్‌గా విక్రమ్ పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన టైటిల్ టీజర్‌తో ప్రేక్షకుల్లో వీర ధీర శూరన్‌పై క్యూరియాసిటీ పెరిగింది.
ఇప్పుడు సిద్ధికీ కూడా నటిస్తుండటం వీర ధీర శూరన్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో తనదైన స్టైలో విక్రమ్ డిఫరెంట్ లుక్, మాస్ యాక్టింగ్‌తో కాళి పాత్రలో అందరినీ మెస్మరైజ్ చేశారు. టైటిల్ టీజర్ చూసిన వారికి విక్రమ్ ఇప్పటి వరకు చేయనటువంటి ఓ పాత్రలో మెప్పించబోతున్నారనే విషయం స్పష్టమైంది.
విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధికీతో పాటు తమిళ వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ ఎస్.జె. సూర్య, దుషారా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
విక్రమ్ ఈ సినిమానే కాకుండా తంగలాన్ కూడా చేస్తున్నాడు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్ ఫేమ్) వెనుక ఉన్న యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారతదేశాన్ని బ్రిటీష్ వారు 'సోనే కీ చిడియా' (బంగారు పక్షి) అని పిలవడానికి గల కారణాన్ని ఈ చిత్రం వెల్లడిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు.
కేజీఎఫ్ ప్రజలు బ్రిటిషర్ల నుంచి గనులను ఎలా కాపాడుకున్నారు వంటి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే తంగలాన్. 19వ శతాబ్దంలో స్వాతంత్యానికి పూర్వం వలసదారుల దోపిడీని నివారించడానికి నివాసితులు ఎలా మార్గాలను కనుగొన్నారో చూపించనున్నారు.
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 1', '2' చిత్రాల తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమానే తంగలాన్. ఇందులో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, ముత్తుకుమార్, హరి కృష్ణన్, ప్రీతి, అర్జున్ ప్రభాకరన్, హాలీవుడ్ నటుడు డేనియల్ గోల్డ్రాగన్ తదితరులు నటిస్తున్నారు.