OTT Best Movies: ఓటీటీలో అదరగొడుతున్న ది బెస్ట్ 5 సినిమాలు- థ్రిల్లింగ్‌ ట్విస్టులు- ఫ్యామిలీతో ఇక్కడ ఎంచక్కా చూసేయండి!-ott netflix top 5 trending movies on this week bade miyan chote miyan ott gangs of godavari ott release new ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Best Movies: ఓటీటీలో అదరగొడుతున్న ది బెస్ట్ 5 సినిమాలు- థ్రిల్లింగ్‌ ట్విస్టులు- ఫ్యామిలీతో ఇక్కడ ఎంచక్కా చూసేయండి!

OTT Best Movies: ఓటీటీలో అదరగొడుతున్న ది బెస్ట్ 5 సినిమాలు- థ్రిల్లింగ్‌ ట్విస్టులు- ఫ్యామిలీతో ఇక్కడ ఎంచక్కా చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 08:26 AM IST

Netflix Trending Movies This Week: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలను తన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చూపించింది. వాటిలో తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌తోపాటు మంచి సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలో అదరగొడుతున్న ది బెస్ట్ 5 సినిమాలు- థ్రిల్లింగ్‌ ట్విస్టులు- ఫ్యామిలీతో ఇక్కడ ఎంచక్కా చూసేయండి!
ఓటీటీలో అదరగొడుతున్న ది బెస్ట్ 5 సినిమాలు- థ్రిల్లింగ్‌ ట్విస్టులు- ఫ్యామిలీతో ఇక్కడ ఎంచక్కా చూసేయండి!

Netflix OTT Trending Movies: ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులను అందుబాటులో ఉంచుతోంది దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్. ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రీమింగ్ కంటెంట్ తీసుకొచ్చి అగ్ర స్థానంలో ఉంటోంది. క్రైమ్, సస్పెన్స్, హారర్, ఫాంటసీ, సర్వైవల్, అడ్వెంచర్, రొమాన్స్, కామెడీ ఇతర జోనర్లలో విడుదల్యయే సినిమాలతో పాటు సొంతగా వెబ్ సిరీసులు నిర్మిస్తుంటుంది నెట్‌ఫ్లిక్స్.

ఎన్నో ఏళ్లుగా ఓటీటీ ఆడియెన్స్‌కు వినోదం పంచుతున్ననెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్ 5 ది బెస్ట్ సినిమాల గురించి తెలుసుకుందాం. వాటిని ఫ్యామిలీతో చూసేందుకు ప్లాన్ చేసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి. మరి ఆ సినిమాలు ఏంటో చూస్తే..

బడే మియా చోటే మియా ఓటీటీ

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి తొలిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టిన సినిమా బడే మియా చోటే మియా. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు రూ. 350 కోట్ల బడ్జెట్ కాగా బాక్సాఫీస్ వద్ద మాత్రం సుమారుగా 95.48 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

థియేటర్లలో ఫెయిల్యూర్‌గా మిగిలిన బేడే మియా చోటే మియా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో (Bade Miyan Chote Miyan OTT) మాత్రం టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది. ఓటీటీ ప్రేక్షకుల ఆదరణతో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీ

విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి హీరో హీరోయిన్స్‌గా నటించిన పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా మే 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాత్రం టాప్ 2 ట్రెండింగ్ స్థానాన్ని సంపాదించుకుంది.

రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ జూన్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ( Gangs Of Godavari OTT Release) స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ నుంచే సినిమాను ఎక్కువ ప్రేక్షకులు వీక్షించడంతో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

లాపటా లేడీస్ ఓటీటీ

హిందీలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమా లాపటా లేడీస్. అంతా కొత్త నటీనటులతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏప్రిల్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ (Laapataa Ladies OTT) అవుతోంది లాపటా లేడీస్.

అయితే, రిలీజ్ డేట్ నుంచే ఓటీటీలో కూడా లాపటా లేడీస్ హ్యూజ్ రెస్పాన్స్ అండ్ క్రేజ్‌తో ట్రెండింగ్‌లో ఉంటోంది. అప్పటి నుంచి ప్రతివారం ఏదో ఒక స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈవారం మూడో స్థానంలో ట్రెండింగ్‌లో ఉండే సత్తా చాటింది. రూ. 4 నుంచి 5 కోట్లతో తెరకెక్కి రూ. 23.29 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా మహిళలు చూసేందుకు మంచి ఆప్షన్.

క్య్రూ ఓటీటీ

పక్కా లేడి ఒరియెంటెడ్ సినిమాగా వచ్చిన బాలీవుడ్ మూవీ క్య్రూ. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్, టబు, కృతి సనన్ కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్చి 29న థియేటర్లలో విడుదలై భారీ హిట్ అందుకుంది. రూ. 75 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 157.08 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది.

రాజేష్ క్రిష్ణన్ దర్శకత్వం వహించిన ఈ క్య్రూ సినిమా (Crew OTT Streaming) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మే 24 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. తాజాగా ఈ వారం కూడా టాప్ 4 ప్లేసులో స్థానం సంపాదించుకుని వుమెన్ పవర్ ఏంటో నిరూపించింది.

అండర్ పారిస్ ఓటీటీ

వీటితోపాటు టాప్ 5 స్థానంలో సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన అండర్ పారిస్ మూవీ (Under Paris Digital Premiere) నిలిచింది. సముద్రంలో షార్క్ అటాక్ నుంచి ప్రాణాలతో బయటపడే అమ్మాయిల కథాంశంతో థ్రిల్లింగ్‌గా సాగే ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

WhatsApp channel