Malayalam OTT: ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్- ఓటీటీలోకి మలయాళ వెబ్ సిరీస్- తెలుగులోనూ స్ట్రీమింగ్? ఎక్కడంటే?
Nagendran's Honeymoons OTT Streaming: ఓటీటీలోకి మరో సరికొత్త మలయాళ కామెడీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్ రానుంది. ఐదుగురు భార్యలతో భర్త హనీమూన్‌కు వెళ్లడం అనే కాన్సెప్టుతో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఎక్కడనే వివరాల్లోకి వెళితే..
Nagendrans Honeymoons OTT Release: ఇటీవల కాలలం మలయాళ సినిమా సత్తా చాటుతున్నాయి. అతి చిన్న బడ్జెట్‌తో రూపొంది బాక్సాఫీస్ వద్ద విడుదలై కోట్లల్లో వసూలు చేస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, ఆవేశం, ఆడు జీవితం వంటి సినిమాలు కలెక్షన్లతో దుమ్ము దులిపాయి.
ఇక ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలు, వెబ్ సిరీసులకు స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ఒక డిఫరెంట్ పాయింటి తీసుకుని దాన్ని వివిధ జోనర్లలో మలిచే తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. కొత్త టేకింగ్‌తో ఎంతగానో ఎంగేజ్ అయ్యేలా వాటి కథాకథానాలు ఉంటాయి. ఇప్పుడు అలాగే మరొ విభిన్న పాయింట్‌తో ఓటీటీలోకి వచ్చేస్తోంది మలయాళ కామెడీ వెబ్ సిరీస్.
నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్. దీనికి 1 జీవితం 5 గురు భార్యలు అనేది ఉపశీర్షిక. ఇదివరకు విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ పోస్టర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండటమే కాకుండా ఆశ్చర్యపరిచింది. ఇటీవల నాగేంద్రన్ హనీమూన్ వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదల చేశారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
విలేజ్‌లో ఉండటానికి ఇష్టపడని ఓ వ్యక్తి ఫారెన్ వెళ్లేందుకు ట్రై ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే అతనికి ఐదుగురు అమ్మాయిలతో పెళ్లి కావడం చూపించారు. నువ్ కూడా మీ నాన్న లాగే తయారు అవుతున్నావ్ అని ఓ డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. నిమిషం 8 సెకన్స్ ఉన్న ఈ టీజర్‌లో ఇంతకుమించి వివరాలు ఏం ఇవ్వలేదు. కథను పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్‌గా ఉంచారు.
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీన్ని ఆగస్ట్ 17 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. కాబట్టి, మలయాళం సినిమాలు, వెబ్ సిరీసులను ఆస్వాదించే వారికి ఇది మంచి ఎంటర్టైన్‌మెంట్ కానుంది.
కాగా నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్‌కు ముందుగా మధువీధు అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావించారు. మధువీధు అంటే హనీమూన్ అనే మీనింగ్ వస్తుంది. కానీ, ఆ తర్వాత మార్పులతో నాగేంద్రన్స్ హనీమూన్స్‌గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో సూరజ్ వెంజరమూడ్‌తోపాటు గ్రేస్ ఆంటోనీ, కని కుశృతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరణ్, నిరంజన అనూప్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రెంజీ ఫణిక్కర్ డైరెక్ట్ చేశాడు. ఆయన ఇదివరకు మలయాళంలోని కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ వంటి వెబ్ సిరీస్‌లను తెరకెక్కించారు. వీటితో ఆయన మంచి పేరు తెచ్చుకోగా.. ఈ మూడు వెబ్ సిరీస్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.
ఇక నాగేంద్రన్స్ హనీమూన్స్ వెబ్ సిరీస్‌ను ఒక డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో బహుభార్యత్వం గురించి సెటైరికల్‌గానూ, కామెడీగానూ చూపించనున్నారు. మరి ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.