తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arjun Ambati: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం

Arjun Ambati: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం

Sanjiv Kumar HT Telugu

09 March 2024, 13:07 IST

  • Bigg Boss Ambati Arjun Theppa Samudram: బిగ్ బాస్ 7 తెలుగు ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తెప్ప సముద్రం. మర్డర్ మిస్టరీగా వస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా చైతన్య రావు చేశాడు. ఇటీవల తెప్ప సముద్రం టీజర్‌ను హీరో అల్లరి నరేష్ రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం
బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం

బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా మూవీ.. మర్డర్ మిస్టరీగా తెప్ప సముద్రం

Theppa Samudram Allari Naresh: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ అర్జున్ అంబటి, 30 వెడ్స్ 21 సిరీస్ నటుడు చైతన్య రావు హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ తెప్ప సముద్రం. ఈ సినిమాకు కొరమీను ఫేమ్ కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా చేసింది. అలాగే తెప్ప సముద్రం సినిమాలో రవి శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీకి సతీష్ రాపోలు దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే వహించారు. నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు

VD14: టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!

Thug Life Simbu: కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో.. శింబు ఫస్ట్ లుక్ టీజర్ అదుర్స్

OTT Movies: ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 2 సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. ఎక్కడ చూడాలంటే?

Rashmika Mandanna: స‌ల్మాన్‌ఖాన్‌తో ర‌ష్మిక మంద‌న్న రొమాన్స్ - ఇద్ద‌రి మ‌ధ్య 30 ఏళ్ల ఏజ్ డిఫ‌రెన్స్ - నెటిజ‌న్ల ట్రోల్స్

పి. ఆర్ మ్యూజిక్ అందించిన తెప్ప సముద్రం సినిమా టీజర్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను కామెడీ హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు. తెప్ప సముద్రం టీజర్‌లో అమ్మాయిల మర్డర్ మిస్టరీ వెనుక దాగున్న రాక్షసుడు ఎవరు అనే కోణంలో సాగింది. తెప్ప సముద్రం సినిమాను ఒక మిస్టరీగా ఆద్యంతం థ్రిల్లింగ్ పంచేలా మన ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 2015 లో తెలంగాణాలోని హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది.

అయితే, సినిమాపై మరి కొంత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇక తెప్ప సముద్రం టీజర్ గురించి అల్లరి నరేష్ కామెంట్స్ చేశారు. "తెప్ప సముద్రం టీజర్ చూడగానే ఒక మంచి థ్రిల్ ఫీల్ వచ్చింది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను" అని అల్లరి నరేష్ తెలిపారు. నిర్మాత నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ "నేను ఎంతగానో అభిమానించే నటుడు అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా తెప్ప సముద్రం టీజర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

"నరేష్ అన్న అడగ్గానే మా చిత్రం టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెప్ప సముద్రం మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం" అని బిగ్ బాస్ ఫేమ్, హీరో అంబటి అర్జున్ తెలిపాడు. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ "మా సినిమా టీజర్ అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్ 12న విడుదల కానుంది" అని పేర్కొన్నారు.

ఇక తెప్ప సముద్రం సినిమా నుంచి ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలను ప్రముఖ సింగర్ మంగ్లీ, పెంచల్ దాస్, హేమచంద్ర ఆలపించారు. పీ ఆర్ సంగీతం అందిస్తున్న తెప్ప సముద్రం సినిమాకు శేఖర్ పోచంపల్లి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పని చేస్తున్నారు. కాగా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వస్తున్న తెప్ప సముద్రం సినిమా ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఇందులో చైతన్య రావు పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.