తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vd14: టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!

VD14: టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!

Sanjiv Kumar HT Telugu

09 May 2024, 13:51 IST

    • VD14 Glimpse On Vijay Devarakonda Birthday: విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన 14వ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. టాక్సీవాలా మూవీ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌తో కలిసి విజయ్ దేవరకొండ చేస్తున్న మరో సినిమానే వీడీ14. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!
టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!

టాక్సీవాలా డైరెక్టర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అంటూ!

Vijay Devarakonda Birthday VD14 Poster: హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan), ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయింది. ఇవాళ (మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ట్రెండింగ్ వార్తలు

NTR Neel Update: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై కీలక అప్‍డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పటి నుంచో చెప్పిన టీమ్

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

Payal Rajput: వారు వేదిస్తున్నారు: లీగల్ యాక్షన్‍కు రెడీ అయిన పాయల్ రాజ్‍పుత్

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

బీటలు వారిన పొలంలో

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు.

చారిత్రక సంఘటనలతో

19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థా చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.

మరోసారి రిపీట్

'టాక్సీవాలా' (Taxiwaala Movie) లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

పీరియాడిక్ డ్రామా

కాగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఇదివరకు విజయ్ దేవరకొండతో ట్యాక్సీవాలా సినిమానే కాకుండా శ్యామ్ సింగరాయ్, ది ఎండ్ సినిమాలను తెరకెక్కించారు. నేచురల్ స్టార్ నాని హీరోగా చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో తెలిసిందే. ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమాల అప్డేట్స్

ఇప్పుడు ఇదే తరహాలో విజయ్ దేవరకొండతో వీడీ14 సినిమాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ఇక మే 9 విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

జెర్సీ డైరెక్టర్‌తో

తాజాగా వీడీ14 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా.. మరో రెండు సినిమాల అప్డేట్స్ రానున్నాయి. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో వీడీ12 టైటిల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు. సితారా ఎంటర్టైన్‌మెంట్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బొర్సేను ఎంపిక చేసుకున్నట్లు టాక్.

మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో

ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండనుందని సమాచారం. ఈ చిత్రానికి రాజా వారు రాణిగారు డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం