Nani: నేనే సినిమాలకు బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. కానీ: నేచురల్ స్టార్ నాని కామెంట్స్-natural star nani comments on allari naresh in aa okkati adakku trailer launch faria abdullah ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: నేనే సినిమాలకు బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. కానీ: నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nani: నేనే సినిమాలకు బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. కానీ: నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Apr 23, 2024 09:04 AM IST

Nani About Aa Okkati Adakku Movie: అల్లరి నరేష్ చాలా గ్యాప్ తర్వాత కామెడీతో వస్తున్న సినిమా ఆ ఒక్కటి అడక్కు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌కు సినిమాలకు బ్రేక్ ఇవ్వమని తానే చెప్పినట్లుగా తెలిపాడు.

నేనే సినిమాలకు బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. కానీ: నేచురల్ స్టార్ నాని కామెంట్స్
నేనే సినిమాలకు బ్రేక్ ఇవ్వమని చెప్పాను.. కానీ: నేచురల్ స్టార్ నాని కామెంట్స్

Nani About Naresh Movies: కామెడీ కింగ్ అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

జాతి రత్నాలు హీరోయిన్

ఇటీవల విడుదలైన ఆ ఒక్కటి అడక్కు టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 22న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో నరేష్ కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటిస్తోంది.

సాధారణంగా అడగరు

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. "ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా నన్ను అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్థమవుతోంది. 'ఆ ఒక్కటీ అడక్కు'.. నరేష్ నాన్న గారు డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ ఉందని అనుకుంటున్నాను" అని అన్నారు.

నేనే బ్రేక్ ఇవ్వమన్నా

"నరేష్ అద్భుతమైన నటుడు. తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే కోరాను. కానీ, ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్‌లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో ఉన్న పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ఉంది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది" నాని తెలిపారు.

మరో మెట్టు ముందుకు

"ట్రైలర్‌ని చాలా ఎంజాయ్ చేశాను. మే 3న నరేష్‌తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. 'ఆ ఒక్కటీ అడక్కు'తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఫరియా అందమైన చిరునవ్వు గల నటి. దర్శకుడు మల్లి గారికి ఆల్ ది బెస్ట్. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నారు. కంటెంట్ ప్రామెసింగ్ అండ్ ఫ్రెష్‌గా ఉంది. ఈవీవీ గారి ఆశీర్వాదం కూడా టీం అందరికీ ఉంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను" చెప్పుకొచ్చారు నాని.

మే 3న గ్రాండ్ రిలీజ్

కాగా టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌజ్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఆ ఒక్కటి అడక్కు ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాతోపాటు వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ (Ariyana Glory) తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

బోల్డ్ బ్యూటి అరియానా పాత్ర

ఇందులో ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ జానీ లివర్ కూతురు జామీ లివర్ నటించడం విశేషం. బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరీ కూడా ఆ ఒక్కడి అడక్కు సినిమాలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇంకా తెలియరాలేదు.

IPL_Entry_Point