Naa Saami Ranga Review: నా సామిరంగ రివ్యూ.. నాగార్జున-అల్లరి నరేష్ కెమిస్ట్రీ అదుర్స్.. నాగ్ హిట్ కొట్టాడా?-nagarjuna naa saami ranga review in telugu and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naa Saami Ranga Review: నా సామిరంగ రివ్యూ.. నాగార్జున-అల్లరి నరేష్ కెమిస్ట్రీ అదుర్స్.. నాగ్ హిట్ కొట్టాడా?

Naa Saami Ranga Review: నా సామిరంగ రివ్యూ.. నాగార్జున-అల్లరి నరేష్ కెమిస్ట్రీ అదుర్స్.. నాగ్ హిట్ కొట్టాడా?

Sanjiv Kumar HT Telugu
Jan 14, 2024 02:25 PM IST

Naa Saami Ranga Movie Review: అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. సంక్రాంతి బరిలోకి పోటీగా దిగిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. పండుగ విజేత అయ్యే అవకాశం ఉందా అనే విషయాలను నా సామిరంగ రివ్యూలో తెలుసుకుందాం.

నా సామిరంగ రివ్యూ.. నాగార్జున-అల్లరి నరేష్ కెమిస్ట్రీ అదుర్స్.. నాగ్ హిట్ కొట్టాడా?
నా సామిరంగ రివ్యూ.. నాగార్జున-అల్లరి నరేష్ కెమిస్ట్రీ అదుర్స్.. నాగ్ హిట్ కొట్టాడా?

టైటిల్: నా సామిరంగ

నటీనటులు: నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్, రవి వర్మ, రావు రమేష్, నాజర్ తదితరులు

కథ: అభిలాష్ ఎన్ చంద్రన్

మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: విజయ్ బిన్ని

ప్రొడక్షన్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, అన్నపూర్ణ స్టూడియోస్

సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

ఎడిటింగ్: చోటా కే నాయుడు

రిలీజ్ డేట్: జనవరి 14, 2024

Nagarjuna Naa Saami Ranga Review: సోగ్గాడే చిన్ని నాయనా, బంగర్రాజు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్న కింగ్ నాగార్జున మూడోసారి మరో సినిమా నా సామిరంగతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, రుక్సర్, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సైడ్ హీరోలుగా చేశారు. ఇప్పటికే మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలవగా నాలుగో పోటీదారిగా వచ్చిన నా సామిరంగ రివ్యూలోకి వెళితే..

కథ:

పశ్చిమ గోదావరి జిల్లాలోని అంబాజీ పేటలో కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) ప్రాణ స్నేహితులు. అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు. ఆ ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్)కు చాలా గౌరవం ఇస్తారు. ఆయన చెప్పిన మాట దాటరు. పక్క గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు (రావు రమేష్) కూతురు వరాలు అలియాస్ వరలక్ష్మీ (ఆషికా రంగనాథ్) కిష్టయ్య చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. కానీ, కిష్టయ్య ప్రేమను వరాలు దూరంగా పెడుతుంది.

హైలెట్ అంశాలు

మరోవైపు పెద్దయ్య కొడుకులు (భరత్ రెడ్డి, షబ్బీర్)లకు కిష్టయ్య అంటే కోపం. ఈ క్రమంలోనే అంబాజీపేటకు, పక్క గ్రామానికి సంక్రాంతి పండుగ వివాదంగా మారుతుంది. సంక్రాంతి పండుగ ప్రభల ఊరేగింపు వ్యవహారం కిష్టయ్యకు, పెద్దయ్య కొడుకులకు వైరం తెచ్చేలా చేస్తుంది. కిష్టయ్యపై పెద్దయ్య కొడుకులకు ఎందుకు అంత కోపం? వారి వైరం కిష్టయ్యకు ఎలాంటి బాధ కలిగించింది? కిష్టయ్య ప్రేమను వరాలు అంగీకరించిందా? భాస్కర్ (రాజ్ తరుణ్), కుమారి (రుక్సార్ ధిల్లాన్) ప్రేమకథ ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే నా సామిరంగ చూడాల్సిందే.

విశ్లేషణ:

నా సామిరంగ సినిమా కథ కొత్తదేం కాదు. ఇలాంటి కథలు ఇప్పటికీ చాలానే వచ్చాయి. కానీ, నా సామిరంగ సినిమా 1980 కాలం నేపథ్యంలో జరుగుతుంది. రెండు గ్రామాల మధ్య ఏర్పడిన వైరం, ప్రేమకథ, స్నేహం, అభిమానం వంటి ఎమోషన్లతో కలగలపిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ నా సామిరంగ. మలయాళ హిట్ మూవీ పొరింజు మరియం జోస్‌కు రీమేక్ అనగానే నా సామిరంగపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, తెలుగు నెటివిటీకి తగినట్లుగా కథలో మార్పు చేసి సినిమాను తెరకెక్కించారు.

ఆ డౌట్ రాదు

మలయాళ మూవీ చూడకుండా నేరుగా నా సామిరంగ చూస్తే మాత్రం ఇది రీమేక్ మూవీ అని ఎవరికీ డౌట్ రాదు. అంతలా పల్లెటూరి నేపథ్యంలో బాగా చిత్రీకరించారు. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, కామెడీ అన్ని పర్ఫెక్ట్ టైమ్‌తో సినిమా చూసేవిధంగా మలిచారు. అయితే, సెకండాఫ్‌లో వచ్చే రెగ్యులర్ సీన్స్, స్లో నెరేషన్ కాస్తా నిరాశ పరుస్తాయి. కొత్తదనం కోరుకునేవారికి అవి బారంగా కనిపిస్తాయి. కానీ, వరాలు, అంజి పాత్రల కన్వర్జేషన్ దాన్ని దూరం చేస్తుంది.

క్యూరియాసిటీ ఉండదు

సినిమా ఫ్లోలో బాగా రన్ అవుతుంది. అయితే, నెక్ట్స్ ఏంటీ అనే క్యూరియాసిటీ పెద్దగా ఏర్పడదు. ఊహించే విధంగానే సీన్స్ ఉంటాయి. 1980 కాలం అని చెప్పిన దానికి తగిన సినిమాటోగ్రఫీ ఉండదు. ఆ పీరియాడిక్ కాలంలోకి తీసుకెళ్లలేకపోయారు. సెట్స్, క్యాస్ట్యూమ్స్, మ్యూజిక్ నేటి కాలానికి తగినట్లుగానే ఉంటాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే.. ఎత్తుకెళ్లిపోతా పాట ఆకట్టుకుంటుంది. మిగతా పాటలు కూడా బాగున్నాయి. రూరల్ బ్యాక్ డ్రాప్ బీజీఎమ్ బాగుంది.

ఎవరెలా నటించారంటే?

నాగార్జున మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సీన్స్‌లో చెలరేగిపోయాడు. పల్లెటూరి కథ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే పాత్రల్లో నాగ్ అదరగొడతాడు. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. అల్లరి నరేష్ కూడా కుమ్మేశాడు. ఏడిపించాడు, నవ్వించాడు, యాక్షన్ సీన్స్‌లో కూడా పోటీ ఇచ్చాడు. నాగ్, నరేష్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. రాజ్ తరుణ్ పాత్రకు మంచి వెయిటేజ్ ఉంది. ఇక ఆషికా రంగనాథ్‌కు మంచి పాత్రే దక్కింది. దాన్ని ఆమె నిలబెట్టుకుంది. రుక్సర్, మిర్నా మీనన్ బాగా చేశారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

మిగతా పాత్రలంతా తమ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే.. సినిమాలో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఉన్న కథలో బలం లేకపోయేసరికి కాస్తా తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ, సంక్రాంతి పండుగ ఫీల్ తెప్పిస్తుంది. సంక్రాంతికి మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

WhatsApp channel