Thug Life Simbu: కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో.. శింబు ఫస్ట్ లుక్ టీజర్ అదుర్స్
09 May 2024, 13:01 IST
- Kamal Haasan Thug Life Simbu First Look: ఉలగ నాయగన్ కమల్ హాసన్, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న 'థగ్ లైఫ్' సినిమా నుంచి కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. శింబు ఇంట్రడక్షన్ వీడియోతో అధికారికంగా తన పాత్రను ప్రకటించారు.
కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో.. శింబు ఫస్ట్ లుక్ టీజర్ అదుర్స్
Simbu First Look From Thug Life: 'విక్రమ్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'థగ్ లైఫ్'తో రాబోతున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్‌ను తమిళ దర్శక దిగ్గజం మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.
1987లో వచ్చిన కమల్ హాసన్, మణిరత్నం కల్ట్ ఫిల్మ్ 'నాయకన్' తర్వాత ఈ లెజండరీ ద్వయం మరోసారి కలిసి పని చేస్తున్నారు. అద్భుతమైన తారాగణం, అగ్రశేణి సాంకేతిక నిపుణులతో థగ్ లైఫ్ హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుగా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న సిలంబరసన్ టిఆర్ (Silambarasan TR) కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ ప్యాక్‌డ్ టీజర్ షేర్ చేస్తూ శింబు పాత్రను పరిచయం చేశారు మేకర్స్.
ఈ టీజర్‌లో కారులో దుమ్మురేపుతూ వచ్చిన శింబు (Simbu) గన్‌ని గురిపెట్టి కాల్చడం పవర్ ఫుల్‌గా ఉంది. ఎడారిలో కారులో దూసుకు వస్తున్నట్లుగా శింబును చూపించారు. ఇందులో శింబు స్టైల్ అదిరిపోయింది. 46 సెకన్లపాటు ఉన్న ఈ టీజర్ వీడియో సూపర్బ్‌గా ఉంది. చివరిలో శింబు స్మైల్ హైలెట్‌గా నిలిచింది. ఈ వీడియోలో టౌన్‌లో కొత్త థగ్ అని శింబును పరిచం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక థగ్ లైఫ్ సినిమాను కమల్ హాసన్.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్స్‌పై ఆర్. మహేంద్రన్ శివ అనంతన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ ఎంటర్ టైనర్‌కి ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా అన్‌బరివ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. .
కాగా ఇప్పటికే విడుదలైన థగ్ లైఫ్ సినిమా టీజర్, కమల్ హాసన్ లుక్‌లు అద్భుతమైన స్పందనతో అభిమానులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా విడుదలైన శింబు ఫస్ట్ లుక్ టీజర్ సైతం అదిరిపోయింది. అయితే, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), తమిళ హీరో జయం రవి (Jayam Ravi) నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా శింబు పాత్ర రివీల్ చేయడంతో సీతారామం హీరో దుల్కర్ సల్మాన్, సైరన్ హీరో జయం రవి థగ్ లైఫ్‌లో నటించట్లేదని తెలుస్తోంది. కాగా ఇందులో హీరో అశోక్ సెల్వన్ కూడ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిలో క్లారిటీ రావాల్సి ఉంది. థగ్ లైఫ్ టీమ్ ఏప్రిల్ చివరి వారం నుంచి ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది.
మీర్జాపూర్ వెబ్ సిరీస్ (Mirzapur Web Series) యాక్టర్స్ అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠిలతో కమల్ షూట్ చేసినట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ చెన్నైలో కూడా జరగనుంది. థగ్ లైఫ్ సినిమాలో హీరోయిన్ త్రిష, గౌతమ్ కార్తీక్, ఆదికేశవ విలన్ జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు.