Chiranjeevi: చిరంజీవి ఇంటికి కమల్ హాసన్, సల్మాన్ ఖాన్.. ఫొటోలు వైరల్
మూడు సినీ ఇండస్ట్రీలకు చెందిన ముగ్గురు లెజెండరీ నటులు ఒక్కచోట చేరారు. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లకు ఆతిథ్యమిచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ ఫొటోలను తన ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఓ మెగాస్టార్. ఇక తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూపర్‌స్టార కమల్‌హాసన్. ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా అందరికీ సుపరిచితమైన పేరు సల్మాన్ ఖాన్. ఈ ముగ్గురూ ఒక్కచోట కలిశారు. కమల్ లేటెస్ట్ మూవీ విక్రమ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మూవీ సక్సెస మీట్ కోసం శనివారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్.. రాత్రి చిరంజీవి ఇంటికి వెళ్లాడు.

అటు గాడ్‌ఫాదర్ మూవీలో చిరంజీవితో కలిసి నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మెగాస్టార్ ఆతిథ్యం స్వీకరించాడు. కమల్ హాసన్, చిరంజీవి సుమారు నాలుగు దశాబ్దాలుగా మిత్రులు. దీంతో చాలా రోజుల తర్వాత నగరానికి వచ్చిన కమల్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు చిరంజీవి. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి విక్రమ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ ఫొటోను ఆదివారం ఉదయం చిరంజీవి తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. "నా చిరకాల మిత్రుడు కమల్‌హాసన్‌ను అతని విక్రమ్ సక్సెస్ సందర్భంగా గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సల్లూ భాయ్, లోకేష కనగరాజ్ & టీమ్‌కు కూడా గత రాత్రి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. విక్రమ్ మూవీ చాలా థ్రిల్లింగా ఉంది. నా ఫ్రెండ్‌కు శుభాకాంక్షలు" అని చిరంజీవి అన్నాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్‌ను, సల్మాన్‌ఖాన్‌ను సన్మానించాడు.
ఈ నెల 3న రిలీజైన విక్రమ్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఒక్క తమిళంలోనే రూ.100 కోట్లు దాటాయి.
సంబంధిత కథనం