తెలుగు న్యూస్  /  Entertainment  /  Bellamkonda Sreenivas Gets Grand Welcome At Hyderabad Airport

Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు అదిరిపోయే వెల్‌కమ్.. ఎయిర్‌పోర్టులో ఎగబడిన ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu

03 April 2023, 18:21 IST

  • Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు అదిరిపోయే వెల్‌కమ్ చెప్పారు అభిమానులు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన అతన్ని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఫ్యాన్స్.. భారీ బైకు ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఘన స్వాగతం
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఘన స్వాగతం

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఘన స్వాగతం

Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 16 ఏళ్ల కిందట ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి మూవీని ఇప్పుడదే పేరుతో హిందీలో తీశాడు శ్రీనివాస్. ఇందులో అతడు లీడ్ రోల్ పోషించాడు. ఈ మధ్యే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలతో ఫుల్ టైంపాస్.. అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్

Aarambham: ఆ సినిమాలన్నీ ఓటీటీలోకే.. సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ అన్ని జోనర్లతో ఆరంభం: నటుడు రవీంద్ర విజయ్

Suhas: నా సినిమాలు మౌత్ టాక్‌తోనే వెళ్తాయి.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది.. సుహాస్ కామెంట్స్

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

ముఖ్యంగా అతని మేకోవర్, యాక్షన్ సీన్స్ లో అతని నటన అభిమానులకు బాగా నచ్చింది. హిందీతో ఈ సినిమాను వీవీ వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ప్రమోషన్ల కోసం నార్త్ వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్.. సోమవారం (ఏప్రిల్ 3) హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అతనికి ఘన స్వాగతం పలికారు అభిమానులు.

ఎయిర్ పోర్టులో అతడు రాగానే ఫ్యాన్స్ చుట్టుముట్టారు. వందల మంది అభిమానులు చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొందరు అతనితో సెల్ఫీల కోసం పోటీ పడగా.. మరికొందరు అతనికి దండలు వేయడానికి ప్రయత్నించారు. దూరం నుంచి దండలు విసిరారు. కొన్ని నేరుగా వెళ్లి శ్రీనివాస్ మెడలో పడటం విశేషం.

దీనికి సంబంధించిన వీడియోను విరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. ఎయిర్ పోర్టు నుంచి బెల్లంకొండ తన లగ్జరీ రేంజ్ రోవర్ కారులో టాప్ ఓపెన్ చేసుకొని అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడు. అతన్ని వందల సంఖ్యలో బైకులతో ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగులో వచ్చిన ఛత్రపతి మూవీ అప్పట్లో సంచలనం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనకు మాత్రమే సాధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాంటి మూవీని ఇప్పుడు వీవీ వినాయక్ తో కలిసి బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో తీశాడు. ఈ మూవీ టీజర్ చూస్తుంటే అచ్చూ తెలుగు ఛత్రపతి చూస్తున్నట్లే అనిపించింది. ఈ సినిమాలో నుష్రత్ భరూచా, భాగ్యశ్రీలాంటి వాళ్లు కీలకపాత్రల్లో నటించారు. మే 12న సినిమా రిలీజ్ కాబోతోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.