Prabhas 50 Feet Cut Out: హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ ఆదిపురుష్ 50 ఫీట్స్‌ క‌టౌట్ - లాంఛింగ్ ఎప్పుడంటే...-prabhas fans launching 50 feet huge adipurush cutout on sriramanavami
Telugu News  /  Entertainment  /  Prabhas Fans Launching 50 Feet Huge Adipurush Cutout On Sriramanavami
ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas 50 Feet Cut Out: హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ ఆదిపురుష్ 50 ఫీట్స్‌ క‌టౌట్ - లాంఛింగ్ ఎప్పుడంటే...

26 March 2023, 12:16 ISTNelki Naresh Kumar
26 March 2023, 12:16 IST

Prabhas 50 Feet Cut Out: ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా మార్చి 30 నుంచి ప్రారంభించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అదే రోజు ప్ర‌భాస్ ఫ్యాన్స్ హైద‌రాబాద్‌లో ఓ భారీ క‌టౌట్‌ను ఏర్పాటుచేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

Prabhas 50 Feet Cut Out: ప్ర‌స్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ప్ర‌భాస్ ఆదిపురుష్ ఒక‌టి. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. జూన్ 16న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మూడు నెల‌లు స‌మ‌యం ఉండ‌గా ఇప్ప‌టికీ చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌క‌పోవ‌డంపై ప్ర‌భాస్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతోన్నారు.

ఈ విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో శ్రీరామన‌వ‌మి సంద‌ర్భంగా ఆదిపురుష్‌ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ప్ర‌భాస్ అభిమానులు కూడా శ్రీరామ న‌వ‌మి ఏర్పాట్ల‌ను భారీగానే చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ప్ర‌భాస్ ఆదిపురుష్ పోస్ట‌ర్ తో కూడిన 50 ఫీట్స్ క‌టౌట్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద మార్చి 30న ఏర్పాటుచేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ క‌టౌట్ నుస్పెష‌ల్‌గా డిజైన్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌బోతున్నారు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఓ సినిమాను రూపొందిస్తోన్నారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ టీజ‌ర్‌లోని విజువ‌ల్ ఎఫెక్ట్స్, ప్ర‌భాస్‌, సైఫ్ అలీఖాన్ లుక్స్‌పై విమ‌ర్శ‌లు రావ‌డంతో రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు.

విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో రీ వ‌ర్క్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇందుకోసం దాదాపు వంద కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. ఆదిపురుష్ సినిమాలో జాన‌కిగా కృతిస‌న‌న్ న‌టిస్తోండ‌గా రావ‌ణుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు.

టాపిక్