Nani Dasara Movie Record: దసరా సినిమాతో పవన్, ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేయనున్న నాని
Nani Dasara Movie Record: నాని హీరోగా నటించిన దసరా సినిమా ఓవర్‌సీస్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేయనుంది. ఆ రికార్డ్ ఏదంటే...
Nani Dasara Movie Record: దసరా సినిమాతో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. మంగళవారం రిలీజైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. ఇందులో కంప్లీట్ రస్టిక్ రోల్‌లో నాని కనిపించబోతున్నాడు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అమెరికాలో థియేటర్ల సంఖ్య పరంగా బాహుబలి 2, అజ్ఞాతవాసి, సాహో రికార్డును దసరా బ్రేక్ చేయబోతున్నది. అమెరికాలో నాని దసరా మూవీ 600లకుపైగా లొకేషన్స్‌లో రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 550 లొకేషన్స్‌లో రిలీజ్ కాగా బాహుబలి 2 ఐదు వందలకుపైగా లొకేషన్లలో రిలీజైంది.
స్క్రీన్ లొకేషన్స్ విషయంలో పవన్, ప్రభాస్ సినిమాల రికార్డ్‌ను నాని బ్రేక్ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ తర్వాత అమెరికాలో అత్యధిక లొకేషన్స్‌లో రిలీజ్ అవుతోన్న సినిమా దసరానే కావడం గమనార్హం.
గోదావరిఖని సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ధరణి అనే పాత్రలో నాని కనిపించబోతున్నారు. అతడికి జోడీగా వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ నటిస్తోంది. నేను లోకల్ తర్వాత నాని, కీర్తిసురేష్ జంటగా నటిస్తోన్న సినిమా ఇది. తెలంగాణ నేపథ్యంలో నాని నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.