తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Umapathi First Look Poster: ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న 'ఉమాపతి'.. ఫస్ట్ లుక్ విడుదల

Umapathi First Look Poster: ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న 'ఉమాపతి'.. ఫస్ట్ లుక్ విడుదల

25 October 2022, 7:20 IST

    • Umapathi First Look Poster: చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా చేస్తున్న సినిమా ఉమాపతి. తమిళలంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురానున్నారు కిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్స్ క్రియేషన్స్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్
ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్

ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్

Umapathi First Look Poster: విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేక్షకులకు ఓ వినూత్న అన్హుభూతి కలిగించేలా ఉమాపతి అనే సినిమా రాబోతుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్ద పీట వేస్తూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'కలవని' సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో రానుంది. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

RRR Re-release date: మళ్లీ థియేటర్లలోకి వస్తున్న గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’.. రీరిలీజ్ ఎప్పుడంటే..

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

సత్య ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కే. కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిదా మూవీకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ బాణీలు కడుతున్నారు. రాఘవేంద్ర కెమెరా మెన్ గా పని చేస్తుండగా గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దీపావళి కానుకగా ఈ ఉమాపతి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్ లుక్ ఆకట్టుకుంటోంది. యమహా బైక్ పై పంటపొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమ ముచ్చట్లు జరుపుతున్నట్లు చూపించారు. లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి తోడు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు జోడిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గ లొకేషన్స్ ఎంచుకొని ఈ సినిమాను షూట్ చేశారట. ఈ మూవీలోని అవుట్ అండ్ ఔట్ కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయడం పక్కా అని అంటున్నారు దర్శకనిర్మాతలు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.