తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 6 Episode 51: రసవత్తరంగా 8వ వారం నామినేషన్లు.. ఫైమా, గీతూకు ఇచ్చిపడేసిన మెరీనా.. ఇనాయా ఈజ్ బ్యాక్..!

Bigg Boss Telugu 6 Episode 51: రసవత్తరంగా 8వ వారం నామినేషన్లు.. ఫైమా, గీతూకు ఇచ్చిపడేసిన మెరీనా.. ఇనాయా ఈజ్ బ్యాక్..!

25 October 2022, 7:05 IST

    • Bigg Boss Telugu 6 Episode 51: సేఫ్ రీజన్, సిల్లీ కారణాలతో చప్పగా సాగుతున్న బిగ్‌బాస్ 6 నామినేషన్ ఎపిసోడ్ ఎనిమిదో వారం మాత్రం నామినేషన్లలో హీటెడ్ ఆర్గ్యూమెంట్లు జరిగాయి. మొత్తంగా దాదాపు అందరూ హౌస్ మేట్స్ ఈ సారి నామినేషన్‌లో ఉన్నారు.
బిగ్‌బాస్ 8వ వారం నామినేషన్ ప్రక్రియ
బిగ్‌బాస్ 8వ వారం నామినేషన్ ప్రక్రియ

బిగ్‌బాస్ 8వ వారం నామినేషన్ ప్రక్రియ

Bigg Boss Telugu 6 Episode 51: బిగ్‌బాస్ షోలో అన్నింటింకంటే నామినేషన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ప్రోమో దగ్గర నుంచి మెయిన్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఆరో సీజన్‍‌లో ఇప్పటి వరకు ఏడు వారాలు సేఫ్ రీజన్, సిల్లీ కారణాలతో చప్పగా సాగుతున్న నామినేషన్ ఎపిసోడ్ ఎనిమిదో వారం మాత్రం నామినేషన్లలో హీటెడ్ ఆర్గ్యూమెంట్లు జరిగాయి. ఇంతవరకు పెద్దగా నోరు మెదపని రోహిత్, మెరీనా లాంటి వాళ్లు కూడా ఇచ్చిపడేశారు. తమను డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

The First Omen OTT: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

ముందుగా ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితం గురించి శ్రీహాన్‌కు చెప్పుకుంటుంది. "నా లైఫ్‌లో ఫస్ట్ ఫంక్షన్ తన ఎంగేజ్మెంటే. ఎంతో ఇష్టంతో చేసుకున్నాను. అప్పటి వరకు అతడి గురించి ఎవరేం చెప్పినా శత్రువులా చూసేదాన్ని. రిలేషన్‌లోకి వెళ్లిన తర్వాత అమ్మాయిగా మారిపోయాను. పక్కవాళ్ల ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది. కానీ అతడు నిశ్చితార్థం రోజు స్టేజ్‌పైనే తిట్టేశాడు. ఓ నెల రోజుల తర్వా కొందరు అమ్మాయిలతో స్క్రీన్ షాట్లు చూపించారు. ఆ తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ ఆసుపత్రి పాలవ్వడంతో మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది." అని తన పాత జ్ఞాపకాలను పంచుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి హౌస్‌లో ఎందుకు ప్రస్తావిస్తుందో జనాలకు అర్థం కావట్లేదు.

ఇక నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చబెట్టి వారి ముందు మంట పెట్టారు బిగ్‌బాస్. నామినేట్ చేయాల్సిన ఇద్దరి ఇంటి సభ్యుల ఫొటోలను మంటల్లో వేసి నామినేట్ చేయాల్సిందిగా సూచించారు. ముందుగా శ్రీసత్యను నామినేషన్ ప్రక్రియను ప్రారంభించమని తెలిపింది. ఇందుకు శ్రీ సత్య సూర్య, మెరీనాను నామినేట్ చేసింది. చిట్టిలు టాస్క్ తర్వాత తన పేరు వచ్చిందని మరుసటి రోజు పంచాయితీ పెట్టడాన్ని శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున తప్పు పట్టిన విషయం తెలిసిందే. అయితే నాగ్ సార్ అడిగినప్పుడు తమకు శ్రీసత్య నచ్చిందని సూర్య తెలపడంతో ఆమె అవాక్కైంది. అదే కారణాన్ని ఈ నామినేషన్‌లో ప్రస్తావిస్తూ సూర్యను నామినేట్ చేసింది. చిట్టీల టాస్క్ తర్వాతే తనను అడుగకుండా మనస్సులో పెట్టుకుంటే తనకు ఎలా అర్థమవుతుందని సెలవిచ్చింది. అయితే సూర్య కూడా ఇందుకు బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. తను చిట్టీలు వేసేటప్పుడు మాట్లాడలేదని, అలాగే తర్వాత డిస్కషన్‍‌లోనూ నోరువిప్పలేదని, ఇందుకు కారణం నువ్వు నా అభిప్రాయాన్ని అడకపోవడమేనని బదులిచ్చాడు. అనంతరం శ్రీసత్య మెరీనాను కూడా ఇదే కారణంతో నామినేట్ చేసింది.

గీతూపై మెరీనా ఫైర్..

అనంతరం ఆదిరెడ్డి ఇనాయా, మెరీనాను నామనేట్ చేశాడు. ముందు సూర్యతో తర్వాత శ్రీహాన్‌తో మీరు క్లోజ్ అవ్వడం తనకు ఫేక్ అనిపించిందని చెబుతాడు. ఇందుకు ఇనాయా కూడా నేను ఫేక్ కాదని వాదించింది. మరో నామినేషన్‌ను మెరీనాకు ఇచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం గీతూ కూడా మెరీనా, ఇనాయాను నామినేట్ చేసింది. గత ఏడు వారాల్లో ఐదు వారాలు నీ గేమ్ నాకు కనిపించలేదని మెరీనాను నామినేట్ చేసింది. రోహిత్‌తో కలిసి ఆడమని చెప్పినప్పుడు ఆడలేదని, కలిసి ఆడకూడదని చెప్పినప్పుడు ఆడారన్నట్లు వాదించింది. నువ్వు స్వీటెస్ట్ పర్సనే కానీ,, గేమ్ విషయంలో మాత్రం కాదని అర్జున్ గుడ్ కానీ.. గుడ్ గేమర్ కాకపోవడం వల్లే అతడు బయటకు వెళ్లిపోయాడన చెబుతుంది. ఇందుకు మెరీనా కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నువ్వు కూడా ఫిజికల్ టాస్క్‌ల్లో మైనస్ అని తెలిపింది. ఫిజికల్‌గా ఈ హౌస్‌లో అందరికంటే ఎక్కువ టాస్క్‌లు ఆడింది తానే అని గీతూ సమర్థించుకుంది. ఇందుకు స్లో మోషన్‌లో అంటూ మెరీనా మళ్లీ కౌంటర్ ఇచ్చింది. అనంతరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. మెరీనా నువ్వు జీరో, అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అనగానే ఆమె కంటతడి పెట్టుకుంది.

గీతూకు ఇచ్చిపడేసిన రోహిత్..

అనంతరం రోహిత్-గీతూ మధ్య కూడా గట్టి వాదనలు జరిగాయి. ఇన్ని రోజులు సైలెంట్‌గా రోహిత్.. గీతూకు అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. ఫిజికల్ గేమ్‌ను ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నలో విఫలమయ్యావని, నువ్వు స్ట్రాంగ్ కానప్పుడు.. స్ట్రాంగ్‌గా ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను ఎందుకు పట్టుకున్నావ్, కీర్తి, ఫైమాను ఎందుకు అడ్డుకోలేదని పాయింట్ లేవనెత్తాడు. నువ్వు చేసిన ప్రయత్నం తనకు కామెడీలాగా అనిపించిందని తెలిపాడు. నేను ఎవర్నీ పట్టుకోవాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అంటూ గీతూ అనగా.. నువ్వు ఆల్రెడీ వెరీ స్మార్ట్ కదా.. కానీ నాకు అక్కడ నీ స్మార్ట్‌నెస్ నాకు కనిపించలేదు అని రోహిత్ అన్నాడు. దీంతో గీతూ సీరియస్ అయింది. ఇద్దరూ గట్టిగా వాదించుకున్నారు. నేను నీ గేమ్ గురించి మాట్లాడుతున్నాను.. కానీ నేను నీ మైండ్ గురించి మాట్లాడుతున్నాను అంటూ వ్యక్తిగత దూషణకు దిగింది. వీరిద్దరి వాదనలో రోహిత్‌ అదిరిపోయే పాయింట్ లేవనెత్తగా.. డిఫెండ్ చేసుకోలేక వ్యక్తిగత దూషణకు దిగింది గీతూ. మరో నామినేషన్‌లో శ్రీసత్యను నామినేట్ చేసింది.

ఫైమా నోరు జారేసింది..

తనకు డిజాస్టర్ ట్యాగ్‌ను ఇవ్వడంపై మెరీనా ప్రస్తావిస్తూ.. వేరేవాళ్లు చెబితే ఫైమా తనకు ఆ ట్యాగ్ ఇచ్చిందని తెలపింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేనొక కంటెస్టెంట్‌గా నా ఒపినియన్ ముందు పెట్టవచ్చు అని చెప్పగా. ముందు పెట్టుకోవచ్చు, వెనక పెట్టుకోవచ్చు, పక్కకు పెట్టుకోవచ్చు అని ఫైమా వ్యంగ్యంగా సెటైర్ వేసింది. దీంతో సీరిసయ్ మెరీనా.. కొంచెం పద్దతిగా మాట్లాడు, హౌస్‌మేట్‌కు గౌరవం ఇవ్వడం నేర్చుకో నీ మాటలు కొంచెం కంట్రోల్ బాగా ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఫైమా మాత్రం తను నోరు జారినట్లు ఒప్పుకోకుండా ఆ వాదనను ఇంకా పెద్దదిగా చేయాలని చూడాటం గమనార్హం. అనంతరం మరో నామినేషన్‌లో రాజ్‌ను నామినేట్ చేసింది.

కీర్తికి రేవంతే టార్గెట్..

కీర్తి.. ఇప్పుడప్పుడే రేవంత్‌ను వదిలేలా అనిపించలేదు. కోపం తగ్గించుకోవాలంటూ మరోసారి నామినేట్ చేసింది. మొదటి రోజు నుంచి మీకు నామినేషన్‌కు పాయింట్ దొరక్క అందరూ రేవంత్‌కు వేస్తున్నారు కాబట్టి మనమూ వేద్దాం అని వేసేది మీరే అంటూ రేవంత్ ఫైర్ అయ్యాడు. మీరు చేసింది పాయింట్ లెస్ అని ప్రూవ్ అయింది. అందుకే నేను ఇక్కడ ఉన్నాను అంటూ వాదించాడు. కిచెన్‌లో ప్రతి విషయంలో రేవంత్ తలదూరుస్తుంటే ఇరిటేషన్ వస్తుందని కీర్తి నోరు జారింది. దీంతో రేవంత్‌కు కూడా కోపం వచ్చింది. నువ్వంటేనే ఇరిటేషన్, నీ మాటలకు అసహ్యం వేస్తుందని నేను ఎప్పుడైమా మీకు చెప్పానా అంటూ ఘాటుగా స్పందించాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడవగా.. చివర్లో ప్లీజ్ నన్ను ఎక్కువగా కెలక్కే అంటూ ముగించేశాడు.

అనంతరం తన మరో నామినేషన్‌లో గీతూను నామినేట్ చేశాడు. నువ్వు నా ముందు నథింగ్ అంటూ గీతూపై ఫైర్ అయ్యాడు రేవంత్. నువ్వు నన్ను ఏం పీకలేవ్ అని కూడా అన్నాడు. రా పీకి చూపిస్తా అంటూ ఫైర్ అయింది. నువ్వు పెరుగు దొంగవని రేవంత్‌పై గీతూ నింద మోపింది. ఇందుకు నేను అందరి ముందు ధైర్యంగా తిన్నాను.. నువ్వు చీకట్లో దొంగిలించావ్ అంటూ ఉదాహరణ కూడా ఒకటి చెప్పాడు. ఇద్దరి మధ్య వాడీ వేడీగా చర్చ జరిగింది. అనంతరం ఇనాయా.. సూర్య, శ్రీహాన్‌ను నామినేట్ చేసింది. తమ మధ్య ఏదో ఉందని హౌస్ మేట్స్ అనుకుంటున్నారని, స్నేహం తప్పా అదేం లేదని వారితో చెబుతూ.. ఇది ఇంతటితో కట్ అయిపోవాలని కోరుకుంటున్నానని అదే కారణంతో ఇద్దరినీ నామినేట్ చేసింది.

అనంతరం వాసంతి.. ఆదిరెడ్డి, సూర్యను నామినేట్ చేయగా.. శ్రీహాన్ మెరీనా, బాలాదిత్యను నామినేట్ చేశాడు. సూర్య.. ఇనాయా, శ్రీసత్యను నామినేట్ చేశాడు. రాజ్.. ఇనాయా, రేవంత్‌ను నామినేట్ చేశాడు. రోహిత్, వాసంతి నేరుగా నామినేషన్‌లో ఉండటంతో మొత్తంగా హౌస్ నుంచి బయటకు వెళ్లేందకుు ఇంటి సభ్యులందరూ నామినేషన్‌లోకి వచ్చారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం