తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sitara Classical Dance: మహేష్ బాబు కూతురు సితార క్లాసికల్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్

Sitara Classical Dance: మహేష్ బాబు కూతురు సితార క్లాసికల్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్

HT Telugu Desk HT Telugu

24 October 2022, 20:31 IST

    • Sitara Classical Dance: మహేష్ బాబు కూతురు సితార క్లాసికల్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అవుతోంది. తన గురువు మహతితో కలిసి ఆమె ఈ డ్యాన్స్ చేసింది.
తన గురువు మహతితో కలిసి డ్యాన్స్ చేస్తున్న సితార
తన గురువు మహతితో కలిసి డ్యాన్స్ చేస్తున్న సితార (Instagram)

తన గురువు మహతితో కలిసి డ్యాన్స్ చేస్తున్న సితార

Sitara Classical Dance: సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది వాళ్లు కూతురు సితార. తాజాగా ఆమె ఓ క్లాసికల్‌ డ్యాన్స్‌తో దీపావళి శుభాకాంక్షలు చెప్పిన వీడియో వైరల్‌ అవుతోంది. తన గురువు మహతితో కలిసి ఆమె ఈ డ్యాన్స్‌ చేసింది. వెస్టర్న్‌తో పోలిస్తే క్లాసికల్‌ డ్యాన్స్ చేయడం చాలా కష్టం.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

కళ్లతోనే ఎన్నో హావభావాలు పలికించాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో సితార మంచి స్మైల్‌తో వేసిన డ్యాన్స్ మూవ్స్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. "'సితార.. నువ్వు నన్నెప్పుడూ గర్వపడేలా చేయడంలో విఫలం కాలేదు. ఇలాగే సాగిపో. ఆమెతో ఇలా డ్యాన్స్‌ చేయించిన గురువులు మహతి భిక్షు, అరుణ భిక్షులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ హ్యాపీ దీపావళి" అనే క్యాప్షన్‌తో మహేష్‌ ఈ వీడియో పోస్ట్‌ చేశాడు.

మహేష్‌ పోస్ట్‌పై సితార తల్లి నమ్రత కూడా స్పందించింది. "నువ్వు మా యువరాణివి. నన్ను ఎంతో గర్వపడేలా చేస్తావు" అని ఆమె కామెంట్ చేసింది. అటు సితార ఘట్టమనేని కూడా ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీపావళి రోజు మా గురువు మహతి భిక్షు అక్కతో కలిసి ఈ డ్యాన్స్‌ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ ఆమె ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది.

సితార ఇంతకు ముందు కూడా ఇలాంటి డ్యాన్స్‌లు చేసి ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఆ మధ్య మహేష్‌ సూపర్‌ హిట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటకు కూడా సితార డ్యాన్స్‌ చేసింది. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం