తెలుగు న్యూస్  /  Entertainment  /  Amb Classic At Airport As Mahesh Venkatesh And Rana Come Together

AMB Classic at Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు, రానా థియేటర్

Hari Prasad S HT Telugu

01 March 2023, 20:27 IST

    • AMB Classic at Airport: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మహేష్ బాబు, రానా, వెంకటేశ్ కలిసి ఓ డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడీ థియేటర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఏఎంబీ క్లాసిక్ థియేటర్
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఏఎంబీ క్లాసిక్ థియేటర్

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఏఎంబీ క్లాసిక్ థియేటర్

AMB Classic at Airport: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓవైపు సినిమాలతో బిజీగా ఉండటంతోపాటు మరోవైపు ఇతర వ్యాపారాలూ చేస్తున్నాడు. ఇప్పటికే అతడు థియేటర్లు, రెస్టారెంట్ల బిజినెస్ లో ఉన్న విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించాడు. మరోవైపు అదే ఏషియన్ తో కలిసి చెయిన్ రెస్టారెంట్లూ మొదలుపెట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

OTT Movies This Weekend: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి రానున్న ఈ 4 చిత్రాలను మిస్ అవొద్దండి!

Rajinikanth Biopic: రజినీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న బాలీవుడ్ నిర్మాత! వివరాలివే

Panchayat S3 Release: ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానున్న పంచాయత్ సీజన్ 3.. డేట్ కోసం ఫ్యాన్స్‌కు పని పెట్టిన ఓటీటీ

Pushpa 2 First Song: పుష్ప 2 నుంచి తొలి పాట వచ్చేసింది.. దేశమంతా పూనకాలే.. అదిరిపోయిన అల్లు అర్జున్ స్టెప్స్

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సినిమాస్ చెయిన్ చాలా పెద్దది. ఇప్పుడదే ఏషియన్ తో కలిసి మహేష్ బాబుతోపాటు వెంకటేశ్, రానా దగ్గుబాటిలు కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ డ్రైవ్ ఇన్ థియేటర్ ప్రారంభించబోతున్నారు. దీనిపేరు ఏఎంబీ క్లాసిక్. ఇందులో ఏషియన్ అధిపతి సునీల్ నారంగ్ ప్రధాన వాటాదారు.

ఈ థియేటర్ కోసం ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు నిర్వహించే జీఎంఆర్ గ్రూపుతోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ లోనే ఓ ప్రైవేట్ ఎన్‌క్లోజర్, ఫుడ్ కోర్టు కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ కు ఈ థియేటర్ బాధ్యతలు అప్పగించారు.

ఈ ఏడాది దసరా నుంచి ఈ థియేటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లను ఇప్పటికే ఏషియన్ సినిమాస్ రెనోవేట్ చేయించి నడిపిస్తున్న విషయం తెలిసిందే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.