Rana Naidu Teaser: 'రానా నాయుడు' టీజర్ వచ్చేసింది.. తండ్రి, కొడుకులుగా వెంకటేశ్, రానా
Venkatesh and Rana in Rana Naidu: వెంకటేశ్(Venkatesh), రానా(Rana) కలిసి నటించిన సరికొత్త సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కానున్న ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రి, కొడుకులుగా నటించారు.
Rana Naidu Official Teaser Released: టాలీవుడ్ స్టార్లు విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి కలిసి ఓ సినిమాలో కనిపిస్తే బాగుంటుందని దగ్గుబాటి అభిమానులు చాలా రోజులుగా అనుకుంటున్నారు. అయితే వీరి కోరిక తరుణం వచ్చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ రానా నాయుడు(Rana Naidu) త్వరలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదలైంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రి, కొడుకులుగా నటించారు. ట్విటర్ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఈ టీజర్‌ను షేర్ చేసింది.
తొలుత హిందీ టీజర్‌ను(Rana Naidu Teaser) విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. “సాయం కావాలా?" అని రానా సంభాషణలతో ఈ టీజర్ మొదలవుతుంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. “మీ సాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రెటీ ఎవరైనా సమస్యల్లో ఉంటే వారు మీకే ఫోన్ చేస్తారు. ఫిక్సర్ ఫర్ ది స్టార్స్, రానా భాగమయ్యాడంటే అది భారీ కుంభకోణమే అయి ఉంటుందని ఈ నగరం మొత్తం చెప్పుకుంటోంది." అనే డైలాగులు రానా పాత్ర గురించి తెలియజేస్తుంది.
రానా తండ్రి పాత్రలో విక్టరీ వెంకటేశ్ కనిపించాడు. వృద్ధుడి పాత్రలో తెల్లటి జుట్టుతో వెంకీ అదరగొట్టారు. ఇంత వరకు అస్సలు చూడని లుక్‌లో వెంకీ మామ దర్శనమిచ్చారు. టీజర్ చివర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పించేలా ఉన్నాయి. రానా, వెంకటేశ్ కలిసి నటించింది ఇందులోనే. ఇంతకుముందు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురంలో పాటలో గెస్ట్ రోల్‌లో కనిపించారు వెంకటేశ్.
అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్‌కు రీమేక్‌గా ఇది తెరకెక్కింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా పతాకంపై సుందర్ ఆరోన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం