Allu Arjun: సుకుమార్ అసలు పేరు తప్పుగా చెప్పిన అల్లు అర్జున్.. తెరపైకి కులం చర్చ.. మొన్న సీఎం, నేడు పుష్ప 2 డైరెక్టర్!
13 December 2024, 11:02 IST
- Allu Arjun Calls Sukumar Original Name Improperly: పుష్ప 2 థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ పేరును పొరపాటున తప్పుగా పలికాడు అల్లు అర్జున్. దాంతో సోషల్ మీడియాలో కులంపై చర్చకు దారితీసింది. పుష్ప 2 ది రూల్ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించారు.
సుకుమార్ అసలు పేరు తప్పుగా చెప్పిన అల్లు అర్జున్.. తెరపైకి కులం చర్చ.. మొన్న సీఎం, నేడు పుష్ప 2 డైరెక్టర్!
Allu Arjun Wrongly Pronounce Sukumar Original Name: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య పొరపాటున ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు. పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచనాలు సృష్టిస్తున్న సమయంలో అల్లు అర్జున్ ప్రముఖులపేర్లు తప్పుగా పలకడం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
వెయ్యి కోట్లు కొల్లగొట్టి
ఇదివరకు పుష్ప 2 ది రూల్ సక్సెస్ మీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయాడని అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పేరు విషయంలో ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు బన్నీ. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ది రూల్ మూవీ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న విషయం క్రియేట్ చేస్తోంది.
ఢిల్లీలో థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్
ఈ సందర్భంగా గురువారం (డిసెంబర్ 12) ఢిల్లీలో థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ''నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్'' అని అల్లు అర్జున్ చెప్పాడు.
ఇది ఇండియా గెలుపు
''భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ. ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్ చేశాయి. ఇదే నా దేశం గొప్పతనం'' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
బండి సుకుమార్ రెడ్డిదే
''ఇక ఈ పుష్ప 2 సినిమాను ఆదరిస్తున్న అన్నిరాష్ట్రాల సినీ పరిశ్రమలకు, అక్కడికి సినీ ప్రముఖులకు, ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియా వాళ్లకు నా థాంక్స్. ముఖ్యంగా పుష్ప-2 సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు నా మనస్పూర్తిగా థాంక్స్. ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న దర్శకుడు బండి సుకుమార్ రెడ్డిదే'' అని అల్లు అర్జున్ చెప్పాడు.
సుకుమార్ అసలు పేరు ఇదే
నిజానికి సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. కానీ, పుష్ప 2 థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్‌లో సుకుమార్ పేరును పొరపాటున అల్లు అర్జున్ పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో తెరపైకి కులం చర్చ వచ్చింది. సుకుమార్ రెడ్డి వర్గానికి చెందినవాడా అని పలువురు సందేహిస్తున్నారు. సుకుమార్.. రెడ్డి కులానికి చెందినవాడే కాదు అని మరికొంతమంది చెబుతున్నారు.
ఆర్యసుక్కు అని
అయితే, సుకుమార్ తన పూర్తి పేరును ఎక్కడ చెప్పుకోలేదు. ఆర్య నుంచి ఇప్పటివరకు టైటిల్ కార్డ్స్‌లో సుకుమార్ అని మాత్రమే వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఆర్యసుక్కు అనే పేరుతో సుకుమార్ అకౌంట్స్ ఉంటున్నాయి. కాగా డైరెక్టర్ సుకుమార్ పేరును అల్లు అర్జున్ తప్పుగా పలకడంతో కులంపై చర్చ తెరపైకి వచ్చింది. అలాగే, ఈ విషయంలో అల్లు అర్జున్‌పై మరోసారి ట్రోలింగ్ జరుగుతుంది.