Pushpa 2 Box Office: పుష్ప 2కి 1105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్- నార్త్‌లోనే ఎక్కువ- తెలుగు రాష్ట్రాల్లో హిట్ పడాలంటే?
Pushpa 2 The Rule 8 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ది రూల్ మూవీకి వారం రోజుల్లో రూ. 1067 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. మరి పుష్ప 2 కి 8 రోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
Pushpa 2 Box Office Collection Day 8: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. వారం రోజుల్లో పుష్ప 2 చిత్రానికి రూ. 1067 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టినటన్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా తెలిపింది.
పుష్ప 2 డే 8 కలెక్షన్స్
మొదటి వారం పూర్తయి రెండో వారంలోకి అడుగుపెట్టిన పుష్ప 2 ది రూల్ మూవీ 8వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టింది. భారత మార్కెట్‌లో పుష్ప 2 మూవీ 8వ రోజున రూ. 37.9 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది. ఇందులో తెలుగు నుంచి రూ. 8 కోట్లు, తమిళంలో రూ. 1.8 కోట్లు, కన్నడలో రూ. 30 లక్షలు, మలయాళం నుంచి రూ.30 లక్షలుగా ఉన్నాయి.
పడిపోయిన పుష్ప 2 కలెక్షన్స్
అయితే, వీటన్నికంటే ఎక్కువగా హిందీ బెల్ట్ నుంచి రూ. 27.5 కోట్లు వచ్చాయి. కాకపోతే, ఏడో రోజుతో పోల్చుకుంటే 8వ రోజున పుష్ప 2 కలెక్షన్స్ పడిపోయాయి. సుమారుగా 12.57 శాతం పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ పడిపోయినట్లు సక్నిల్క్ తెలిపింది. ఇక ఇండియా వైడ్‌గా 8 రోజుల్లో పుష్ప 2 సినిమాకు రూ. 726.25 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.
హిందీ నుంచే ఎక్కువ
ఇందులో తెలుగు ద్వారా రూ. 241.9 కోట్లు వస్తే దానికంటే ఎక్కువగా హిందీ బెల్ట్ నుంచి రూ. 425.6 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం. అలాగే, తమిళ వెర్షన్‌కు రూ. 41 కోట్లు, కన్నడలో రూ. 5.35 కోట్లు, మలయాళం నుంచి రూ. 12.4 కోట్లు వసూలు అయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లో రూ. 1067 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 మూవీ 8 రోజుల్లో రూ. 1105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా సైట్స్ అంచనా వేశాయి.
వరల్డ్ వైడ్‌గా హిట్ కొట్టాలంటే?
ఇక పుష్ప 2 సినిమాకు గురువారం (డిసెంబర్ 12) తెలుగులో 24.63 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇప్పటికీ 82 శాతం కలెక్షన్స్ రికవరీ చేసుకున్న పుష్ప 2 మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్‌గా రూ. 620 కోట్లు ఫిక్స్ చేసుకుంది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి పుష్ప 2 ది రూల్ హిట్ కొట్టాలంటే సినిమాకు ఇంకా రూ. 100 కోట్ల వరకు కలెక్షన్స్ రావాలని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.
తెలుగులో హిట్ కావడానికి
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 310 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఈ లెక్కన ఏపీ, తెలంగాణలో కూడా పుష్ప 2 హిట్ కొట్టాలంటే చిత్రానికి ఇంకా రూ. 65 కోట్ల వరకు వసూళ్లు రావాల్సి ఉంది. పుష్ప 2 హిట్ కావాలంటే మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.