తెలుగు న్యూస్  /  Entertainment  /  Allari Naresh As School Teacher In Itlu Maredumilli Prajaneekam Movie

Allari Naresh | స్కూల్ టీచర్‌గా అల్లరి నరేశ్.. మరోసారి సీరియస్ కథకే ఓటు!

24 May 2022, 12:48 IST

    • నాంది ఇచ్చిన విజయంతో అల్లరి నరేశ్ మరోసారి సీరియస్ కథను ఎంచుకున్నాడు. అదే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమాలో అతడు ఓ స్కూల్ టీచర్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో అల్లరి నరేశ్
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో అల్లరి నరేశ్ (Twitter)

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో అల్లరి నరేశ్

వినోదాత్మక చిత్రాలతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. అయితే ఎప్పుడు ఒకే పంథాలోనే వెళ్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. అందుకే వరుస వైఫల్యాలను చవిచూసిన నరేశ్.. గతేడాది రూటు మార్చి సీరియస్ డ్రామా అయిన నాంది అనే చిత్రం చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నరేశ్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మరోసారి సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించున్నాడు మన అల్లరోడు. అదే ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

Krishna mukunda murari serial april 29th: ముకుంద ఉచ్చులో పడిన మురారి, కృష్ణ.. సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిన భవానీ

Brahmamudi April 29th Episode: బ్రహ్మముడి- అనామికను కొట్టేంతపని చేసిన కనకం- ఇక పుట్టింటికే- పూల బొకేలో రాజ్ బిడ్డ రహస్యం

ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమా నరేశ్ నటిస్తోన్న 59వ చిత్రం. ఈ సినిమా కథ అటవీ వాసుల జీవితంపై ఆధారపడి ఉంటుందట. ఇటీవలే చిత్రబృందం విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ఎంతో ఆకర్షించింది. ఇందులో అల్లరి నరేశ్.. ఎన్నికల విధుల కోసం అటవీ గ్రామానికి వెళ్లిన ఓ స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా సీరియస్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతేకాకుండా మంచి సందేశం కూడా ఉంటుందని సమాచారం. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర లాంటి వారు కీలక పాత్రలు ఫోషిస్తున్నారు.

ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తుండగా.. చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా చేస్తున్నారు. వెంకట్ ఆర్ స్టంట్ మాస్టర్‌గా చేస్తున్నారు. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. నాంది లాంటి సీరియస్ స్టోరీతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేశ్.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంతో మరోసారి కూడా సీరియస్ కథనే నమ్ముకున్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి.

 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.