తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial April 29th: ముకుంద ఉచ్చులో పడిన మురారి, కృష్ణ.. సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిన భవానీ

Krishna mukunda murari serial april 29th: ముకుంద ఉచ్చులో పడిన మురారి, కృష్ణ.. సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిన భవానీ

Gunti Soundarya HT Telugu

29 April 2024, 8:05 IST

    • Krishna mukunda murari serial april 29th episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ముకుంద వేసిన ప్లాన్ లో మురారి, కృష్ణ చిక్కుకుపోతారు. సరోగసి ద్వారా పిల్లల్ని కందామని కృష్ణ చెప్పేసరికి ముకుంద ఆనందానికి అవధులు ఉండవు. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial april 29th episode: సమయం చూసి మీరా చెప్పిన సరోగసి విధానం గురించి కృష్ణతో చెప్పాలని మురారి అనుకుంటాడు. పిల్లలంటే పెద్ద సమస్య కాదా? పిల్లలు లేకపోయినా పర్వాలేదా అంటుంది. ముందు మనం బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలని చెప్తాడు. ఆ మాటలకు కృష్ణ ఎమోషనల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Salman Khan: సల్మాన్ ఖాన్ ఆ గుడికి వచ్చి క్షమాపణ అడగాలి.. అలాంటి తప్పు మళ్లీ చేయనని ప్రమాణం చేయాలి: బిష్ణోయ్ సమాజం

Inception 2: నోలాన్ మాస్టర్‌పీస్ మూవీ ఇన్‍సెప్షన్‍కు సీక్వెల్ రానుందా?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వదులుకున్న నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇవే

నా జీవితమే మారిపోయింది 

నిన్ను ఎప్పుడైతే సంతోషంగా ఉంచలేకపోతానో అప్పుడు నేను బాధపడతానని అంటాడు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అలాగే మనకు ఒక పరిష్కారం దొరుకుతుందని కృష్ణకి సర్ది చెప్తాడు. ముకుంద సంతోషంగా డాక్టర్ వైదేహి దగ్గరకు వస్తుంది.

ఈ లోకంలో ఉన్న ఆనందం మొత్తం నా దగ్గరే ఉందని ముకుంద సంబరంగా వైదేహికి స్వీట్ పెడుతుంది. ఇప్పటి వరకు నాకు చాలా మంది హెల్ప్ చేశారు కానీ వాటి వల్ల నాకు ఉపయోగం లేదు. కానీ నువ్వు చేసిన హెల్ప్ వల్ల నా జీవితమే మారిపోయింది.

నీ వల్ల త్వరలోనే నాకు పుట్టబోయే పాపకు నీ పేరే పెడతానని అంటుంది. కృష్ణ కడుపులో బిడ్డ పెరగదు అంటే నా కడుపులో పెరిగినట్టే. మురారి నావాడు అయినట్టే. దీనికి అసలు కారణం నువ్వే కదా అంటుంది. డాక్టర్ ముకుంద వైపు అదోలా చూస్తుంది.

నేను క్రిమినల్ 

నిన్ను క్రిమినల్ గా చూడాలా లేదంటే ప్రేమికురాలిగా చూడాలో అర్థం కావడం లేదని వైదేహి అంటుంది. ప్రేమ కోసం ఆరాటపడే వాళ్ళు క్రిమినల్స్ గానే కనిపిస్తారు. మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారో తెలుసా? ప్రేమ కోసం త్యాగాలు చేస్తారు. లేదంటే చచ్చిపోతారు అలాంటి వాళ్ళు అసలు ప్రేమికులే కాదు.

ప్రేమ కోసం ఏమైనా చేయాలి. ఎంతకైనా తెగించాలి. ఆ ప్రాసెస్ లో క్రిమినల్ అనిపించుకున్నా తప్పు లేదు ప్రేమ దక్కితే చాలు అంటుంది. వైదేహి నువ్వు సరోగసి స్పెషలిస్ట్ కదా నీతో నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంది. కృష్ణ భవానీ మాటలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

మిమ్మల్ని ఏ ముహూర్తాన ఏబీసీడీల అబ్బాయి అన్నానో కానీ దేవుడు ఇక ఈ అమ్మాయికి అబ్బాయి ఎందుకు అని పిల్లలు పుట్టకుండా చేశాడు. ముకుంద వాళ్ళ మాటలు వింటుంది. మీరు ఉండగా నాకు పిల్లలు ఎందుకు ఏసీపీ సర్. నేను బాధపడతానని మీరు, మీరు బాధపడతారని నేను బాధ లేనట్టు నటిస్తున్నాం కానీ మన గుండెల్లో బాధ లేదా?

భయంగా ఉందన్న కృష్ణ 

ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుంది. పెద్దత్తయ్యని చూడగానే ఏడుస్తూ ఎక్కడ నిజం చెప్పేస్తానోనని గుండెల్లో వణుకు పుడుతుంది. పెద్దత్తయ్యకు నిజం ఎప్పటికీ తెలియకూడదు చెప్పనని మాట ఇవ్వండి అంటుంది.

ఎన్నాళ్ళు చెప్పకుండా ఉంటాం. ఎన్నాళ్ళు పిల్లల కోసం మభ్యపెడతామని మురారి అంటాడు. సరోగసి గురించి చెప్పకుండా సోది చెప్తాడు ఏంటని ముకుంద తిట్టుకుంటుంది. విన్నప్పుడు బాధపడినా తర్వాత పరిస్థితి అర్థం చేసుకుంటారు.

పిల్లలు పుడతారని గిల్టీ ఫీలింగ్ తో బతికే కంటే నిజం చెప్పడమే బెటర్ అంటాడు. ప్లాన్ మొత్తం చెడగొట్టలేలా ఉన్నాడని ముకుంద టెన్షన్ పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. పెద్దత్తయ్యకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నా మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ కావాలన్నా ఒకే ఒక మార్గం ఉంది ఏసీపీ సర్.

సూపర్ కృష్ణ 

సరోగసి అని కృష్ణ చెప్పడంతో ముకుంద ఆనందానికి అవధులు ఉండవు. సరోగసి అంటే గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. నువ్వు సూపర్ కృష్ణ ఫస్ట్ టైమ్ నేను అడగకుండానే నేను కోరుకున్నది చేస్తున్నావని ముకుంద ఆనందపడుతుంది. మురారి మౌనంగా ఉంటాడు. ముకుంద చెప్పిన సరోగసి మాటలు గుర్తు చేసుకుంటాడు.

ఇప్పుడు ఇంతకుమించి వేరే దారి లేదని కృష్ణ అంటుంది. ఇందులో తప్పేముంది నా గర్భాశయంలో బిడ్డని మోసే పరిస్థితి లేదు. లీగల్ గా జెనటిక్ గా బిడ్డ మనదే అవుతుంది. కాకపోతే తొమ్మిది నెలలు మోశామనే అనుభూతికి దూరం అవుతానని అనిపిస్తుంది. కానీ పెద్దత్తయ్య ఆశల్ని మోస్తున్నామనే దాని ముందు అది పెద్ద బాధ కాదని చెప్తుంది.

నాకు ఎప్పుడో ఈ ఆలోచన వచ్చింది కానీ అది మాట్లాడేందుకు ఇది మంచి సమయం కాదని ఆగిపోయానని చెప్తాడు. ఈ ఆలోచన రాగానే ఎంత రిలీఫ్ గా ఉందోనని కృష్ణ సంతోషంగా చెప్తుంది. ఒక మంచి అమ్మాయిని చూసి సరోగసికి వెళ్లిపోదామని చెప్తుంది. మురారి అందుకు ఒకే చెప్తాడు.

మీరా కాదు ముకుంద 

డాక్టర్ మహేశ్వరి దగ్గరకు వెళ్ళి ఇప్పుడే సరోగసి గురించి మాట్లాడాలని కృష్ణ వాళ్ళు వెళ్లిపోతారు. ఇక మురారి నావాడు కాకుండా ఎవరూ ఆపలేరు కృష్ణ అని ముకుంద తెగ మురిసిపోతుంది. రేవతి కృష్ణ కనిపించిందా అని మధుని అడుగుతుంది. లేదు కృష్ణ వాళ్ళు మాత్రమే కాదు మురారి కూడా కనిపించడం లేదని అంటాడు.

మీరా, మురారి కలిసి ఎక్కడికైనా వెళ్లారో ఏంటోనని మధు అనేసరికి ఆదర్శ్ కోపంగా ఏమన్నావ్ అంటాడు. మీరా కాదు ముకుంద అంటాడు. అసలు పేరు మీరానే ముకుంద అని నువ్వు పెట్టావని మధు కోపంగా చెప్తాడు. పెట్టాను కదా అలాగే పిలువు.

అసలు ముకుంద మురారితో కలిసి వెళ్లలేదు. అసలు ముకుంద మురారితో ఎందుకు వెళ్తుందని సీరియస్ అవుతాడు. అయినా వెళ్తే ఏమవుతుంది ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నావని మధు అంటాడు. కృష్ణ డాక్టర్ మహేశ్వరిని కలిసి సరోగసి గురించి మాట్లాడుతుంది.

వైదేహి దగ్గరకే కృష్ణ 

మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని డాక్టర్ చెప్తుంది. సరోగసి కేసులు తను డీల్ చేయగలమని కృష్ణ అడుగుతుంది. కానీ డాక్టర్ మాత్రం తాను చేయలేనని అంటుంది. మహేశ్వరి డాక్టర్ వైదేహి పేరు సజెస్ట్ చేస్తుంది. ఆవిడ ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేసింది మీరు ఆవిడని కలిసి ప్రాసెస్ చేయమని చెప్తుంది.

పరిమళ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదని అనుకుంటారు. పరిమళ వచ్చేందుకు రెండు నెలలు టైమ్ పడుతుందని మహేశ్వరి చెప్తుంది. కృష్ణకి పిల్లలు కనే యోగం ఉండకూడదు అనుకున్నా జరిగిపోయింది. సరోగసి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా జరిగింది.

అందుకోసం వైదేహి దగ్గరకు వెళ్తున్నారు. ఇది కూడా నేను అనుకున్నట్టు జరిగిపోతే మురారి నా దగ్గరకు రాకుండా ఎవరూ ఆపలేరు. నా రూపం మారినా నా మనసు ఇంత కూడా మారలేదు మురారి. ఆ ముకుంద నీ వెంట పడితే ఈ ముకుంద వెంట నువ్వు పడతావు. నేను వద్దన్నా నా కొంగు పట్టుకుని తిరుగుతావని అనుకుంటుంది.

కృష్ణ వాళ్ళు వైదేహి దగ్గరకు వస్తారు. అప్పుడే ముకుంద ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని వైదేహి ముకుందని అడుగుతుంది. ముకుంద తన ప్లాన్ మొత్తం చెప్తుంది.

తరువాయి భాగంలో..

కృష్ణ వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం చక్కగా డెకరేట్ చేసి ఉంటుంది. భవానీ సంతోషంగా కృష్ణని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. మీరు సర్ ప్రైజ్ అవాలని ఈ పార్టీ ఆరెంజ్ చేసినట్టు భవానీ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారని కృష్ణ అంటుంది. నువ్వు చెప్పకపోయినా నువ్వు తెచ్చుకున్న మామిడి కాయలు చెప్తున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావని అని భవానీ చెప్పేసరికి కృష్ణ షాక్ అవుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం