తెలుగు న్యూస్  /  Entertainment  /  Clarity On Vijay Devarakonda And Samantha Injuries During Khushi Movie Shoot

Vijay Devarakonda | విజయ్-సమంతకు గాయాలపై చిత్రబృందం క్లారిటీ

24 May 2022, 11:09 IST

    • విజయ్, సమంతకు ఖుషీ సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయని వస్తున్న వార్తలపై చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వ వహిస్తున్నారు. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
విజయ్ దేవరకొండ-సమంతకు గాయాలు
విజయ్ దేవరకొండ-సమంతకు గాయాలు (Twitter)

విజయ్ దేవరకొండ-సమంతకు గాయాలు

విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు కలిసి నటిస్తోన్న సినిమా ఖుషి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూట్ కశ్మీర్‌లో ముగిసింది. అయితే ఈ షూట్ సమయంలో సమంత, విజయ్‌కు గాయాలయ్యాయనని, ఓ స్టంట్ సన్నివేశం కోసం చేసిన షూట్‌లో దెబ్బతగిలిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు కూడా నిజంగానే వారికి గాయాలయ్యాయనని ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ వార్తలపై స్పష్టత వచ్చింది. ఇలాంటి ఊహాగానాలను నమ్మవద్దని సినీ వర్గాలకు చిత్రబృందం క్లారిటీనిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Siddharth Heeramandi Review: కాబోయే భార్య నటించిన హీరామండిపై సిద్ధార్థ్ రివ్యూ ఇదీ

Prasanna Vadanam OTT: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Kubera Nagarjuna: కుబేర నుంచి నాగార్జున ఫస్ట్ లుక్.. SRH vs RR మ్యాచ్‌ లైవ్‌లో గ్లింప్స్ రిలీజ్

Shaitaan OTT: ఓటీటీలోకి ఒక్క రోజు ఆలస్యంగా బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

"ఖుషి మూవీ షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలయ్యాయని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీమ్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కశ్మీర్‌లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే హైదరాబాద్ తిరిగి వచ్చింది. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మవద్దు" అని చిత్రబృందం ఫిల్మ్ వర్గాలకు స్పష్టత ఇచ్చింది.

శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత కలిసి రెండో సారి పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది.

ఈ సినిమాను డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. సమంత, విజయ్ కలిసి నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఒకే సారి విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.