తెలుగు న్యూస్  /  Entertainment  /  Actor Vishal Accident Video Gone Viral During The Shooting Of Mark Antony Movie

Actor Vishal Accident Video: తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడిన నటుడు విశాల్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

22 February 2023, 19:05 IST

    • Actor Vishal Accident Video: తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు నటుడు విశాల్. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను విశాలే షేర్ చేసుకున్నాడు.
విశాల్
విశాల్

విశాల్

Actor Vishal Accident Video: నటుడు విశాల్ కు ఈ మధ్య సినిమా షూటింగ్ లు చేదు అనుభవాన్నే మిగులుస్తున్నాయి. గతేడాది కష్టమైన స్టంట్స్ చేస్తూ షూటింగ్ లలో రెండుసార్లు గాయపడ్డాడు. ఇక తాజాగా మరోసారి ఓ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అతని లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ షూటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT release date: ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతున్న మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Releases: ఈ వారం ఓటీటీలోకి 2 బ్లాక్ బస్టర్ సినిమాలు.. రెండూ డిఫరెంట్ జోనర్స్.. మొత్తంగా 16 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Jr NTR Dinner: బాలీవుడ్ స్టార్లతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్ నైట్.. బ్రహ్మాస్త్ర, వార్ 2 టీమ్‌తో కలిసి..

Guppedantha Manasu April 29th Episode: గుప్పెడంత మనసు- దొరికిన రాజీవ్ డెడ్ బాడీ- కోర్టుకు మను- శైలేందపై దేవయాని డౌట్

ఓవైపు షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు నుంచి ఓ వాహనం అదుపు తప్పి షూటింగ్ చేస్తున్న వారిపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో హీరో విశాల్ తోపాటు మిగతా నటీనటులంతా అక్కడే ఉన్నారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మార్క్ ఆంటోనీ షూటింగ్ లో ఓ ఫైటింగ్ సీన్ ను షూట్ చేస్తున్న వేళ ఈ ప్రమాదం జరిగింది.

ఓ ట్రక్ అదుపు తప్పి మనుషులపై దూసుకొచ్చింది. సమయానికి అది మీదికి దూసుకురావడం గమనించిన వాళ్లు అక్కడ నుంచి తప్పుకోవడంతో ఎవరూ గాయపడలేదు. దీనికి సంబంధించిన వీడియోను విశాల్ తన ట్విటర్ లో షేర్ చేశాడు. ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది.

"కొన్ని సెకన్లు, కొన్ని అంగుళాల దూరంతో నా ప్రాణాలను కాపాడుకున్నాను. ఆ దేవుడికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఘటన నుంచి కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాను" అంటూ విశాల్ ప్రమాద వీడియోను పంచుకున్నాడు.

గతేడాది ఇదే మార్క్‌ ఆంటోనీ మూవీ షూటింగ్‌ సందర్భంగా విశాల్‌కు తీవ్ర గాయాలైనట్లు తమిళ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఇందులో ఓ ఫైటింగ్‌ సీక్వెన్స్‌ కోసం క్లిష్టమైన స్టంట్‌ చేయడానికి ప్రయత్నించిన విశాల్‌ గాయపడినట్లు అతని సన్నిహితులు తెలిపారు.

అంతకుముందు నెలలోనే విశాల్‌.. లాఠీ మూవీ క్లైమాక్స్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. అతని కాలి ఎముకల్లో చీలికలు కనిపించాయి. అయితే త్వరగానే కోలుకున్న విశాల్‌ ఆ షూటింగ్‌ పూర్తి చేశాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.