Vishal Mark Antony First Look: మార్క్ ఆంటోనీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ – కొత్త గెట‌ప్‌లో విశాల్‌-vishal ritu varma mark antony movie first look out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vishal Ritu Varma Mark Antony Movie First Look Out

Vishal Mark Antony First Look: మార్క్ ఆంటోనీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ – కొత్త గెట‌ప్‌లో విశాల్‌

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 01:29 PM IST

Vishal Mark Antony First Look: మార్క్ ఆంటోనీ సినిమా కోసం త‌న లుక్‌ను మొత్తం మార్చేశాడు హీరో విశాల్‌. కొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌బోతున్నాడు. విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోమ‌వారం రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

విశాల్‌
విశాల్‌ (Twitter/Vishal)

Vishal Mark Antony First Look: రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా డిఫ‌రెంట్ క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు విశాల్‌. అత‌డు హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. నేడు విశాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో విశాల్ పొడ‌వైన గ‌డ్డంతో రౌద్రంగా దర్శనమిచ్చాడు. గ‌న్ గురిపెడుతూ అతడు కనిపించడం ఆస‌క్తిని పంచుతోంది. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా కొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు.

ఈ మాస్ పోస్ట‌ర్ విశాల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎ.జే సూర్య కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. పాన్ ఇండియ‌న్ సినిమాగా తెర‌కెక్కుతున్న మార్క్ ఆంటోనీ తెలుగు,త‌మిళం,మ‌ల‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో టాలీవుడ్ న‌టి రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా కొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం మార్క్ ఆంటోనీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మార్క్ ఆంటోనీతో పాటు లాఠీ సినిమాలో విశాల్ హీరోగా న‌టిస్తున్నాడు.

IPL_Entry_Point