Telugu News  /  Entertainment  /  Movie Shootings In Tollywood May Commence From August 22
తెలుగు సినిమా నిర్మాతలు (ఫైల్ ఫొటో)
తెలుగు సినిమా నిర్మాతలు (ఫైల్ ఫొటో)

Tollywood Shootings: టాలీవుడ్‌లో త్వరలోనే ప్రారంభం కానున్న షూటింగ్‌లు!

16 August 2022, 18:37 ISTHT Telugu Desk
16 August 2022, 18:37 IST

Tollywood Shootings: టాలీవుడ్‌లో షూటింగ్‌ల బంద్‌ త్వరలోనే ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బడా హీరోల ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. ఈ సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం ఆలోచించాలి అంటూ ఆగస్ట్‌ 1 నుంచి టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు బంద్‌ చేసిన విషయం తెలుసు కదా. ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీసుకున్న నిర్ణయం మేరకు తెలుగులో ఒక్క సినిమా షూటింగ్‌ కూడా జరగడం లేదు. ఇందులో మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ల సినిమాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం.. ఈ బంద్‌ త్వరలోనే ముగియనుంది. అతి త్వరలోనే షూటింగ్‌లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వారం వ్యవధిలో టాలీవుడ్‌లో మూడు హిట్‌ సినిమాలు రావడం, బాక్సాఫీస్‌లు కళకళలాడుతుండటంతో మళ్లీ షూటింగ్‌లు జరపాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ నెల 22 నుంచే తిరిగి షూటింగ్‌లు జరగనున్నాయి.

స్ట్రైక్‌ ముగియగానే బాలయ్య ఎన్‌బీకే107తోపాటు మహేష్‌-త్రివిక్రమ్‌ మూవీ, పవన్‌ కల్యాణ్‌ వినోదయ సీతం రీమేక్‌, అల్లు అర్జున్‌ పుష్ప2 షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ సమస్యలపై షూటింగ్‌లు బంద్ చేసిన తర్వాత చర్చిస్తున్న ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌.. ఓ పరిష్కారం ఆలోచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుతోపాటు ఇతర నిర్మాతలు త్వరలోనే మీడియాలో వెల్లడించే అవకాశం ఉంది.