Vishal Injured: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్‌-kollywood star hero vishal got injured while shooting for mark antony ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishal Injured: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్‌

Vishal Injured: షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన హీరో విశాల్‌

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 12:05 PM IST

Vishal Injured: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ మరోసారి షూటింగ్‌లో గాయపడ్డాడు. గత నెలలోనే తన నెక్ట్స్‌ మూవీ లాఠీ క్లైమాక్స్‌లో గాయపడిన అతడికి.. తాజాగా మరోసారి అలాగే జరగడంపై ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

గత నెలలో లాఠీ మూవీ షూటింగ్ లోనూ గాయపడిన విశాల్
గత నెలలో లాఠీ మూవీ షూటింగ్ లోనూ గాయపడిన విశాల్ (Twitter)

హీరో విశాల్‌ రెండు నెలల వ్యవధిలోనే మూవీ షూటింగ్‌లో రెండోసారి గాయపడ్డాడు. ఈసారి మార్క్‌ ఆంటోనీ మూవీ షూటింగ్‌లో విశాల్‌కు తీవ్ర గాయాలైనట్లు తమిళ మీడియాలో వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇందులో ఓ ఫైటింగ్‌ సీక్వెన్స్‌ కోసం క్లిష్టమైన స్టంట్‌ చేయడానికి ప్రయత్నించిన విశాల్‌ గాయపడినట్లు అతని సన్నిహితులు తెలిపారు.

అతడు గాయపడిన వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశాల్‌ కోలుకోవడానికి సమయం పట్టనుంది. అంత వరకూ మార్క్‌ ఆంటోనీ షూటింగ్ నిలిపి వేయనున్నారు. అయితే అతనికి తీవ్ర గాయాలైన వార్త విని ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. విశాల్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

గత నెలలోనే విశాల్‌.. లాఠీ మూవీ క్లైమాక్స్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. అతని కాలి ఎముకల్లో చీలికలు కనిపించాయి. అయితే త్వరగానే కోలుకున్న విశాల్‌ ఆ షూటింగ్‌ పూర్తి చేశాడు. ఇప్పుడు భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న మార్క్‌ ఆంటోనీలో మరోసారి అలాంటి స్టంట్స్‌ చేయబోయి విశాల్‌ గాయపడ్డాడు. రజనీకాంత్‌ నటించి బాషా సినిమాలో రఘువరన్‌ నటించిన పాత్ర పేరు మార్క్‌ ఆంటోనీ.

ఆ పాత్ర పేరు మీదుగానే ఈ సినిమాకు ఆ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా టైటిట్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్‌ వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్నాడు.

IPL_Entry_Point

టాపిక్