Laththi Movie OTT Release Date: థియేట‌ర్‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే టీవీలోకి వ‌చ్చేస్తోన్న విశాల్ లాఠీ-vishal laththi movie ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vishal Laththi Movie Ott Release Date Locked

Laththi Movie OTT Release Date: థియేట‌ర్‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే టీవీలోకి వ‌చ్చేస్తోన్న విశాల్ లాఠీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 12, 2023 02:23 PM IST

Laththi Movie OTT Release Date: విశాల్ హీరోగా న‌టించిన లాఠీ సినిమా జ‌న‌వ‌రి 13న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

విశాల్
విశాల్

Laththi Movie OTT Release Date: విశాల్ హీరోగా న‌టించిన లాఠీ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న‌ది. ఈ సినిమా స‌న్ నెక్స్ట్ ఓటీటీలో జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు భాష‌ల్లో లాఠీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ది. అంతేకాదు ఓటీటీలో రిలీజైన మూడు రోజుల్లోనే ఈ సినిమా టీవీలో ప్రీమియ‌ర్ కానుంది.

పొంగ‌ల్ కానుక‌గా స‌న్ టీవీలో త‌మిళ వెర్ష‌న్ జ‌న‌వ‌రి 16న టీవీలో టెలికాస్ట్ కాబోతున్న‌ది. సాధార‌ణంగా ఓటీటీలో రిలీజైన నెల, రెండు నెలల గ్యాప్ త‌ర్వాత సినిమాలు టీవీలో ప్రీమియ‌ర్ అవుతుంటాయి. కానీ లాఠీ సినిమా మాత్రం ఓటీటీలో రిలీజైన మూడు రోజుల త‌ర్వాత టీవీలో ప్రీమియ‌ర్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. థియేటర్ రిలీజ్‌, టీవీ ప్రీమియ‌ర్‌కు నెల రోజుల గ్యాప్ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన లాఠీ సినిమాకు ఏ వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

నిజాయితీప‌రుడైన పోలీస్ కానిస్టేబుల్ క‌థ‌తో లాఠీ సినిమా తెర‌కెక్కింది. రౌడీ గ్యాంగ్ నుంచి త‌న ఫ్యామిలీని ఓ కానిస్టేబుల్ ఎలా కాపాడుకున్నాడ‌నే పాయింట్‌తో రూపొందించారు. విశాల్ యాక్టింగ్ బాగున్నా క‌థ‌ను అర్థ‌వంతంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు వినోద్ కుమార్ త‌డ‌బ‌డ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. లాఠీ సినిమాలో సునైన హీరోయిన్‌గా న‌టించింది.

యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతాన్ని అందించాడు. లాఠీ త‌ర్వాత విశాల్ మార్కో ఆంటోనీ అనే పాన్ ఇండియ‌న్ సినిమాలో న‌టిస్తోన్నాడు. ఈ సినిమాతో పాటుగా స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తుప్ప‌రివాల‌న్ -2 సినిమా చేస్తోన్నాడు.

IPL_Entry_Point

టాపిక్