తెలుగు న్యూస్  /  Entertainment  /  Actor Dhanush New Getup Photos Goes Viral Fans Comments As Baba Ramdev

Dhanush New Getup : బాబా రామ్‌దేవ్ బయోపిక్‌లో నటిస్తున్నారా? ధనుష్ మీద ట్రోల్స్

Anand Sai HT Telugu

31 May 2023, 6:18 IST

    • Dhanush New Getup : నటుడు ధనుష్ కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొత్త గెటప్ లో అతడు కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూపించి ఇదిగో ధనుష్ అని చెబితే ఎవరూ నమ్మలేరేమో.
ధనుష్
ధనుష్ (Twitter)

ధనుష్

కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుష్(Actor Dhanush). బాలీవుడ్ జనాలకు కూడా సుపరిచితుడు. తాజాగా ధనుష్ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. అతని లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటో చూపించి ఇతను ధనుష్ అని చెబితే వెంటనే నమ్మలేరు. అతని గెటప్ చాలా మారిపోయింది. ధనుష్‌ని చూసిన ప్రతి ఒక్కరికి బాబా రామ్‌దేవ్(Baba Ramdev) గుర్తుకు వస్తున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 'బాబా రామ్‌దేవ్ బయోపిక్ చేయడానికి ధనుష్ సిద్ధమవుతున్నాడా ?' అనే ప్రశ్న కూడా నెటిజన్లు వేస్తున్నారు. మరి దీనిపై ధనుష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

ట్రెండింగ్ వార్తలు

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

SS Rajamouli's Bahubali: ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ.. కట్టప్పే విలన్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఫ్యాషన్ విషయానికి వస్తే ధనుష్ ఎవరినీ కాపీ కొట్టలేదు. ఎవరు ఏమనుకుంటున్నారో కూడా అతడు పట్టించుకోడు. ఇప్పుడు కొత్త గెటప్ చూసిన అభిమానులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఫోటో అతని అభిమానుల సర్కిల్‌లో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ సానుకూలంగా కామెంట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్'(Captain Miller) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా కోసం ఆయన ఈ గెటప్ వేసుకున్నారని అంటున్నారు.

ధనుష్ మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. పొడవాటి గడ్డం, బాగా జుట్టుతో ఉన్నాడు. ఒక్కసారి చూసి.. ఇతడు ధనుష్ అని చెప్పడం మాత్రం కష్టం. 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, తండ్రీకొడుకులుగా కనిపించనున్నాడని అంటున్నారు. అందుకే ఈ గెటప్ వేస్తున్నాడని చెబుతున్నారు.

ధనుష్ నటించిన సార్ సినిమా.. ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ అయింది. అది విజయం సాధించిన తర్వాత, 'కెప్టెన్ మిల్లర్' పనిలో నిమగ్నమయ్యాడు. ఈ సినిమాపై కన్నడిగుల్లో కూడా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ధనుష్‌తో శివరాజ్‌కుమార్(Shiva Raj Kumar) నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.