Dhanush Vetrimaran movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ-dhanush vetrimaran movie in the kgf backdrop ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dhanush Vetrimaran Movie In The Kgf Backdrop

Dhanush Vetrimaran movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ

Hari Prasad S HT Telugu
May 02, 2023 10:17 PM IST

Dhanush Vetrimaran movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ రాబోతోంది. ఇది నిజంగా అభిమానులకు పండగలాంటి వార్తే. ఈ ఇద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందని వాళ్లు నమ్ముతున్నారు.

ధనుష్, వెట్రిమారన్
ధనుష్, వెట్రిమారన్

Dhanush Vetrimaran movie: తమిళ సినిమాలో ధనుష్ ఓ సూపర్ స్టార్. ఇక డైరెక్టర్ వెట్రిమారన్ ఇప్పటికే పలు కల్ట్ క్లాసిక్ లను అందించాడు. అందులోనూ ధనుష్ తో కలిసి అసురన్ లాంటి సూపర్ డూపర్ హిట్ తీశాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే ఈసారి సూపర్ హిట్ కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్ లో వీళ్ల సినిమా ఉండనుండటం మరింత ఆసక్తి రేపుతోంది.

ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ధనుష్, వెట్రిమారన్ మరో సినిమా చేస్తున్నారని, ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని చెప్పడం విశేషం.అయితే ఈ మూవీ గురించి మిగతా వివరాలేవీ అతడు చెప్పలేదు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.

ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశాయో మనకు తెలుసు. అలాంటి కేజీఎఫ్ నేపథ్యంలోనే ధనుష్, వెట్రిమారన్ మూవీ రానుండటం అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి రేపుతోంది. ఈ మధ్యే వెట్రిమారన్ విడుదలై పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో విడుదల పేరుతో రిలీజైంది.

అటు ధనుష్ కూడా సార్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సార్ మూవీ ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో వాతి పేరుతో ఈ సినిమా రిలీజైంది. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై తీసిన మూవీ ఇది. ధనుష్ తనదైన రీతిలో లెక్చరర్ పాత్రలో జీవించేశాడు. ఈ సార్ మూవీ సుమారు రూ.118 కోట్లు వసూలు చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్