KGF 3 Update: ఇచ్చిన వాగ్ధానం ఇంకా మిగిలే ఉంది.. కేజీఎఫ్-3పై మేకర్స్ అప్డేట్-kgf makers hombale films released a video update on kgf 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 3 Update: ఇచ్చిన వాగ్ధానం ఇంకా మిగిలే ఉంది.. కేజీఎఫ్-3పై మేకర్స్ అప్డేట్

KGF 3 Update: ఇచ్చిన వాగ్ధానం ఇంకా మిగిలే ఉంది.. కేజీఎఫ్-3పై మేకర్స్ అప్డేట్

Maragani Govardhan HT Telugu
Apr 14, 2023 05:16 PM IST

KGF 3 Update: కేజీఎఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ కేజీఎఫ్ ఛాప్టర్-3 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇచ్చిన వాగ్ధానం ఇంకా మిగిలే ఉందంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ దర్సకత్వం వహించిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.

కేజీఎఫ్-3పై క్లారిటీ
కేజీఎఫ్-3పై క్లారిటీ (HT_PRINT)

KGF 3 Update: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫ్రాంఛైజీకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. గతేడాది విడుదలైన కేజీఎఫ్-2 1200 కోట్లకు పైచిలుకు వసూళ్లతో దుమ్మురేపింది. భాషతో సంబంధం లేకుండా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఫలితంగా యశ్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ మూవీ విడుదలై నేటికి కచ్చితంగా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది.

కేజీఎఫ్-3 రాబోతుందని గుర్తు చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. మోస్ట్ పవర్ ఫుల్ మ్యాన్ చేసిన మోస్ట్ పవర్ ఫుల్ ప్రామిస్. అంటూ తన పోస్టులో పేర్కొంది. ఈ వీడియోలో కేజీఎఫ్-2 చిత్రంలో మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిందని, కోట్లమంది అభిమానుల హృదయాలను గెలిచిందని పోస్ట్ చేసింది.

ఈ వీడియో చివర్లో ఇచ్చిన వాగ్ధానం ఇంకా మిగిలే ఉందంటూ కేజీఎఫ్-3పై హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే మూడో భాగం మొదలు కానుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలి రెండు భాగాలు భారీ హిట్ కావడంతో మూడో పార్ట్ సూపర్ హిట్టవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పూర్తి కాగానే ఎన్‌టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత కేజీఎఫ్-3 ప్రారంభం కానుంది.

IPL_Entry_Point