Yash Kgf 3: కేజీఎఫ్ -3 రిలీజ్ మూడేళ్ల త‌ర్వాతే - ప్రొడ్యూస‌ర్ క్లారిటీ-yash birthday producer reveals yash kgf 3 shooting and release details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Yash Birthday Producer Reveals Yash Kgf 3 Shooting And Release Details

Yash Kgf 3: కేజీఎఫ్ -3 రిలీజ్ మూడేళ్ల త‌ర్వాతే - ప్రొడ్యూస‌ర్ క్లారిటీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 08, 2023 09:22 AM IST

Yash Kgf 3: హీరో య‌శ్- ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న కేజీఎఫ్ -3 షూటింగ్‌తో పాటు రిలీజ్‌ఫై ప్రొడ్యూస‌ర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

య‌శ్
య‌శ్

Yash Kgf 3: య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ -2 చిత్రం గ‌త ఏడాది ప‌లు బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టింది. దంగ‌ల్‌, బాహుబ‌లి -2 త‌ర్వాత ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ సినిమాగా కేజీఎఫ్ -2 నిలిచింది. ఈ సినిమాలో హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌ (Prashanth neel). య‌శ్‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

కేజీఎఫ్‌-2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్‌-3ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. మూడో భాగం అనౌన్స్‌మెంట్‌తో ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానుల్లో ఆస‌క్తి మొద‌లైంది.

ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో కేజీఎఫ్ -3 తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. రాఖీభాయ్ త‌న సామ్రాజ్యాన్ని విదేశాల్లో ఎలా విస్త‌రించాడ‌నే పాయింట్‌తో ప‌వ‌ర్ ఫుల్‌గా మూడో భాగాన్ని రూపొందించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం, రిలీజ్ డేట్‌పై ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

2025లో కేజీఎఫ్ -3 షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. 2026లో సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. ప్ర‌శాంత్ నీల్ ప్ర‌జెంట్ క‌మిట్‌మెంట్స్ పూర్త‌యిన త‌ర్వాతే కేజీఎఫ్ -3 షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని విజ‌య్ కిరగందూర్ వెల్ల‌డించాడు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స‌లార్ (Salaar) సినిమా చేస్తోన్నాడు ప్ర‌శాంత్ నీల్‌. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ లోగా పూర్తి చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. స‌లార్ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. ఈ రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే కేజీఎఫ్ -3 సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం.

IPL_Entry_Point

టాపిక్