Dhawan On Dhoni ధోనీలోని కోపాన్ని చాలా సార్లు చూశా - ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Dhawan On Dhoni: ధోనీ కోప్పడటం తాను చాలా సందర్భాల్లో చూశానని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. అయితే ఆ కోపాన్ని ధోనీ బయటకు మాత్రం వ్యక్తం చేయడని పేర్కొన్నాడు.
Dhawan On Dhoni: క్రికెట్‌లో ధోనీని మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కోపం, ఒత్తిడి బయటపడనీయకుండా చాలా ప్రశాంతంగా ధోనీ కనిపిస్తోంటాడు. అతడి వ్యక్తిత్వం, గొప్పతనానికి అది నిదర్శనమని అభిమానులు చెబుతోంటారు.
మిస్టర్ కూల్ ధోనీలోని కోపాన్ని తాను చాలా సార్లు చూశానని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ ధావన్ అన్నాడు. ఈ వీడియో ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీపై ధావన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ధోనీతో కలిసి క్రికెట్ ఆడుతోన్న సమయంలో అతడు ఇతర ప్లేయర్స్‌పై కోపగించుకోవడం తాను చాలా సందర్భాల్లో చూశానని అన్నాడు.
అయితే అందరిలా ఆ కోపాన్ని బయటకు వ్యక్తం చేయడని, అదే ధోనీలో తనకు నచ్చే క్వాలిటీ అని ధావన్ పేర్కొన్నాడు. ధోనీ ఆవేశంగా ఉన్నాడని అతడి కళ్లు చూస్తే అర్థమైపోయేదని, తనలోని కోపం మొత్తం కళ్లలోనే కనిపించేదని చెప్పాడు.
తనలోని ఆగ్రహావేశాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ధోనీకి బాగా తెలుసునని ధావన్ తెలిపాడు. ఆ గుణమే ధోనీని గొప్ప ప్లేయర్‌గా నిలబెట్టిందని చెప్పాడు. కొన్ని సార్లు ఏం మాట్లాడకుండానే ఎదుటి వ్యక్తికి తాను ఏం చెప్పాలనుకున్నాడో తన ముఖకవలికలు, హావభావాల ద్వారా ధోనీ కమ్యూనికేట్ చేస్తుంటాడని ధావన్ పేర్కొన్నాడు.
ధోనీ గురించి శిఖర్ ధావన్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు ధోనీ. ఇదే అతడికి ఐపీఎల్ చివరి సీజన్ కావడం గమనార్హం. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు ఇప్పటికే ఇన్‌డైరెక్ట్‌గా పలుమార్లు ధోనీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం