తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Actors Vs Cricketers: రెండేళ్లకు ఓ హిట్ ఇస్తే హిట్‌మ్యాన్ కాలేరు ఆమీర్‌ను రోస్ట్ చేసిన రోహిత్

Actors vs Cricketers: రెండేళ్లకు ఓ హిట్ ఇస్తే హిట్‌మ్యాన్ కాలేరు ఆమీర్‌ను రోస్ట్ చేసిన రోహిత్

08 January 2024, 19:18 IST

google News
  • Actors vs Cricketers: యాక్టర్లు, క్రికెటర్ల వాగ్వాదం జరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆటగాళ్లు క్రికెట్ వదిలి నటనకు వస్తున్నారని, అందుకే తాము క్రికెట్ ఆడదామనుకుంటున్నామని బాలీవుడ్ హీరోలు ఆమీర్, మధవన్, శర్మాన్ జోషి తెలుపుతారు.

ఆమీర్‌ను రోస్ట్ చేసిన రోహిత్
ఆమీర్‌ను రోస్ట్ చేసిన రోహిత్

ఆమీర్‌ను రోస్ట్ చేసిన రోహిత్

Actors vs Cricketers: మనదేశంలో సినిమాకు, క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఇంక వేటికి లేదనేది వాస్తవం. అందుకే యాక్టర్లకు, హీరోలకు డబ్బుతో పాటు పేరు కూడా విపరీతంగా వస్తుంది. వారు ఏం చేసినా ట్రెండ్ అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే అనేక కంపెనీలు ప్రమోషన్ల రూపంలో వీరిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి. తాజాగా యాక్టర్లు, క్రికెటర్ల మధ్య పోటీ నెలకొంది. మీరు విన్నది నిజమే. బాలీవుడ్ హీరోలు ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషి ముగ్గురు క్రికెటర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మైదానాన్ని వదిలి యాక్టింగ్‌కు వస్తున్నారని క్రికెటర్లను అపహాస్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమీర్, మాధవన్, శర్మాన్ జోషి ముగ్గురు క్రికెటర్ల మాదిరిగా దుస్తులు ధరించి మీడియా సమావేశం నిర్వహిస్తారు. అయితే అక్కడున్నవారంతా 3 ఇడియట్స్‌కు సీక్వెల్‌ రాబోతుందని అనుకుంటారు. అయితే అదేం కాదని వీరు అసలు విషయానికొస్తారు.

మేము ఒకటి నిర్ణయించుకున్నాం. వారు(క్రికెటర్లు) యాక్టింగ్‌లో బిజీ అయ్యారు. కాబట్టి మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నాం అని ఆమీర్ ఖాన్ ముందుగా అంటాడు. అయితే మరోపక్క వీరి మాటలకు కౌంటర్‌గా కొంతమంది క్రికెటర్లు తమ స్పందనను తెలియజేస్తారు. ఆమీర్ మాటకు బదులుగా స్పిన్నర్ అశ్విన్ స్పందిస్తూ మాటలు చెప్పేందుకు రూపాయి కూడా అవసరం లేదు అని కౌంటర్ ఇస్తాడు. అనంతరం ఆమీర్ ఖాన్‌కు రోహిత్ శర్మ స్పందిస్తూ.. లగాన్ సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రాన క్రికెటర్ అవ్వలేరు అంటూ చురక అంటిస్తాడు. మాధవన్ మాట్లాడుతూ.. నిజమైన హిట్లు ఇచ్చేది ఆమీర్ ఖానే. తన కెరీర్‌లో ఎన్నో హిట్లు ఉన్నాయంటూ చెబుతాడు. దీనికి రోహిత్ కౌంటరిస్తూ రెండేళ్లలో ఒక హిట్ కొట్టినంత మాత్రాన హిట్ మ్యాన్ అవ్వలేరని స్పష్టం చేస్తాడు.

ఆ తర్వాత ఆమీర్ నటించిన సినిమాలు 300 కోట్ల క్లబ్‌లో చేరతాయని మాధవన్ అనగా.. ఇందుకు బుమ్రా బదులిస్తూ మైదానంలో 150 కిలోమీటర్ల వేగంతో బంతిని ఆడగలడా అంటూ చురకంటిస్తాడు. యాక్టర్లు మైదానంలో ఆడలేరని, ఒక్క బౌన్సర్ వచ్చిందంటే కింద పడతారని హార్దిక్ పాండ్య అంటాడు. ఇలా యాక్టర్లు, క్రికెటర్లు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ సాగుతుంది వీడియో.

అయితే ఇదంతా నిజం కాదులేండి. ఓ ప్రకటన వీడియోలో భాగంగా వీరు ఈ విధంగా నటించారు. డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్ కోసం ఆమీర్, మాధవన్, శర్మాన్‌తో పాటు టీమిండియా క్రికెటర్లు ఓ ప్రకటన చేశారు. ఈ అడ్వర్టెజ్మైంట్‌లో భాగంగా యాక్టర్లు vs క్రికెటర్లుగా పరిస్థితి మారుతుంది. చూసేందుకు ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. హీరోలు, ఆటగాళ్ల మధ్య ఫన్నీ కౌంటర్లు, సరదా సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.

తదుపరి వ్యాసం