Pakistan Actress Dances to RRR Song: నాటు నాటు పాటకు చిందేసిన పాక్ నటి హనియా ఆమీర్.. వీడియో వైరల్-pakistani actor hania aamir dances to rrr song naatu naatu at a wedding video goes to viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Pakistani Actor Hania Aamir Dances To Rrr Song Naatu Naatu At A Wedding Video Goes To Viral

Pakistan Actress Dances to RRR Song: నాటు నాటు పాటకు చిందేసిన పాక్ నటి హనియా ఆమీర్.. వీడియో వైరల్

నాటు నాటు పాటకు స్టెప్పులేసిన పాక్ నటి
నాటు నాటు పాటకు స్టెప్పులేసిన పాక్ నటి

Pakistan Actress Dances to RRR Song: పాకిస్థాన్ నటి హనియా ఆమీర్ ఆర్ఆర్ఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. తనదైన శైలిలో అదరగొట్టింది. నాటు నాటు హిందీ వెర్షన్ నాచో నాటో పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Pakistan Actress Dances to RRR Song: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతున్న ఈ సినిమాపై మనవాళ్లే కాకుండా విదేశీయులు సైతం విశేషంగా ఆదరించారు. ఇప్పటికే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. ఈ పాట క్రేజ్ ఖండాంతరాలు దాటి మారి అలరించింది. ఇప్పటికే ఎంతో మంది నాటు నాటు పాటకు రీల్స్ చేస్తూ తెగ హడావిడి చేశారు. తాజాగా ఈ పాటకు పాకిస్థాన్ ప్రముఖ నటి హనియా ఆమీర్ డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

పాక్ నటి హనియా ఆమీర్ ఓ పెళ్లి ఫంక్షన్‌లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసింది. నాటు నాటు హిందీ వెర్షన్ నాచో నాచో సాంగ్‌కు స్టెప్పులేసింది. ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సైతం భలేగా డ్యాన్స్ చేసిందంటూ తమ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ప్రదానోత్సవం కోసం ఎదురుచూస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ కూడా అమెరికా వెళ్లి ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అమెరికన్ పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలోనూ పాల్గొన్నారు. దీంతో సర్వత్రా ఆయన వార్తల్లో నిలిచారు. ఆస్కార్ సందర్భంగా మార్చి 3న ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.