Jasprit Bumrah Ipl: ఐపీఎల్‌కు బుమ్రా దూరం - ముంబై ఇండియ‌న్స్‌కు షాక్‌-team india pacer jasprit bumrah likely to miss ipl 2023 season ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Team India Pacer Jasprit Bumrah Likely To Miss Ipl 2023 Season

Jasprit Bumrah Ipl: ఐపీఎల్‌కు బుమ్రా దూరం - ముంబై ఇండియ‌న్స్‌కు షాక్‌

జ‌స్ప్రీత్ బుమ్రా
జ‌స్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah Ipl: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియ‌న్స్ కు పెద్ద షాక్ త‌గిలేలా ఉంది. టీమ్ ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా గాయం కార‌ణంగా ఐపీఎల్‌కు దూరం కావ‌చ్చున‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Jasprit Bumrah Ipl: టీమ్ ఇండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023 సీజ‌న్‌కు దూరం కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌డు మైదానంలో దిగ‌డానికి మ‌రో ఏడెనిమిది నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్‌తో పాటు జూన్‌లో జ‌రుగ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు కూడా బుమ్రా అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అక్టోబ‌ర్‌లో ప్రారంభం కానున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బుమ్రా బ‌రిలో దిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. వెన్ను గాయంతో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ త‌ర్వాత టీమ్ ఇండియాకు దూర‌మ‌య్యాడు బుమ్రా. గాయం తీవ్ర‌త త‌గ్గ‌డానికి అనుకున్న‌దానికంటే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ ఆడితే అత‌డి కెరీర్ రిస్క్‌లో ప‌డే ప్ర‌మాదం ఉండ‌టంతో ఈ సీజ‌న్ మొత్తానికి అత‌డిని దూరం పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. అదే జ‌రిగితే ముంబై ఇండియ‌న్స్‌కు పెద్ద షాక్ త‌గిలిన‌ట్లే. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ప్ర‌ధాన పేస‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు బుమ్రా.

2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు బుమ్రా. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సీజ‌న్ కూడా మిస్ కాలేదు. తొలిసారి అత‌డు ఐపీఎల్‌కు దూరం కాబోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 31 నుంచి మొద‌లుకానుంది.

WhatsApp channel