తెలుగు న్యూస్  /  Business  /  Xiaomi Mi No 1 Fan Festival Sale Starts Deals Discounts Offers On Smartphones Smart Tvs Laptops And More

Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్.. ఈ మొబైళ్లు, స్మార్ట్ టీవీలపై సూపర్ డిస్కౌంట్లు

18 December 2022, 17:01 IST

    • Xiaomi Mi No.1 Fan Festival Sale: ఎంఐ నంబర్ 1 ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఈ సేల్‍‍లో షావోమీ, రెడ్‍మీ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు చాలా ప్రొడక్టులపై డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి. వివరాలు ఇవే..
Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్
Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ (Xiaomi)

Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్

Xiaomi Mi No.1 Fan Festival Sale: 2020 ముగుస్తున్న తరుణంలో ప్రముఖ కంపెనీ షావోమీ సేల్‍ను తీసుకొచ్చింది. ఎంఐ నంబర్.1 ఫ్యాన్ ఫెస్టివల్ (Mi No.1 fan festival) సేల్‍ను మొదలుపెట్టింది. ఈ సేల్‍లో స్మార్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‍టాప్‍లతో పాటు అన్ని కేటగిరీల ప్రొడక్టులపై డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తోంది షావోమీ. ఇప్పటికే ఈ సేల్ మొదలైంది. Mi No.1 Fan Festival Sale సేల్ వివరాలు, డిస్కౌంట్లు, బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో పాటు మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

ఎప్పటి వరకు.. ఎక్కడ?

Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ నంబర్ 1 ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఇప్పటికే మొదలైంది. ఈనెల 21వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుంది. షావోమీ అధికారిక వెబ్‍సైట్ ఎం.కామ్ (mi.com)లో ఈ సేల్ అందుబాటులో ఉంది. డీల్స్, ఆఫర్లు, డిస్కౌంట్లను యూజర్లు ఆ వెబ్‍సైట్‍లో పొందవచ్చు. అలాగే ఎంఐ స్టోర్ యాప్‍లో కూడా ఈ సేల్‍ ఉంటుంది.

Xiaomi Mi No.1 Fan Festival Sale: కార్డ్ ఆఫర్లు

నంబర్.1 ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొంటే రూ.5,000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‍‍డీఎఫ్‍సీ బ్యాంక్, ఎస్‍బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్ కార్డులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇక ఎక్స్చేంజ్‍పై అదనపు బోనస్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

డిస్కౌంట్లు, డీల్స్ ఇలా..

Xiaomi Mi No.1 Fan Festival Sale: ఫ్లాగ్‍షిప్ స్మార్ట్ ఫోన్ షావోమీ 12 ప్రోను ఈ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో రూ.47,999కే దక్కించుకోవచ్చు. కార్డ్ ఆఫర్ ద్వారా రూ.8,000తో పాటు ఎక్స్చేంజ్ బోనస్‍ను వినియోగించుకుంటే ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. రెడ్‍మీ ఏ1 బడ్జెట్ మొబైల్‍ను రూ.5,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్లను వాడుకుంటే రెడ్‍మీ ప్రైమ్ 5జీ ఫోన్‍ను రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఆఫర్లతో రెడ్‍మీ 11ఐ హైపర్ చార్జ్ ఫోన్‍ను రూ.19,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా రెడ్‍మీ కే50ఐ బేస్ మోడల్‍ను రూ.20,999కే దక్కించుకోవచ్చు. ఇక చాలా మొబైళ్లపై కూడా తగ్గింపు ధరతో పాటు కార్డ్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తున్నాయి.

రెడ్‍మీ స్మార్ట్ టీవీ రూ.11,999, షావోమీ స్మార్ట్ టీవీ 5ఏను రూ.12,999కే ఈ నంబర్ 1 ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‍లో కొనుగోలు చేయవచ్చు. 50 ఇంచుల షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్50ను ఆఫర్లతో రూ.31,499కే దక్కించుకోవచ్చు.

Xiaomi Mi No.1 Fan Festival Sale: షావోమీ నోట్‍బుక్ ప్రో 120, షావోమీ నోట్‍బుక్ ప్రో 120జీ ల్యాప్‍టాప్‍లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. వీటిపై రూ.7,500 వరకు తగ్గింపు పొందవచ్చని షావోమీ పేర్కొంది. వీటితో పాటు చాలా షావోమీ ప్రొడక్టులపై ఈ సేల్‍లో డిస్కౌంట్లు, డీల్స్ అందుబాటులో ఉన్నాయి.