తెలుగు న్యూస్  /  Business  /  Why Nykaa Shares Are Down Nearly 20 Percent In 4 Days

Nykaa shares down: నైకా షేర్ ధర నాలుగు రోజుల్లో 20 శాతం డౌన్

HT Telugu Desk HT Telugu

17 November 2022, 11:56 IST

    • నైకా షేర్లు గడిచిన 4 రోజుల్లో 20 శాతం మేర పతనమయ్యాయి. 
Beauty products by Nykaa. In the September quarter, Nykaa had reported net profit of about  ₹5 crore
Beauty products by Nykaa. In the September quarter, Nykaa had reported net profit of about ₹5 crore

Beauty products by Nykaa. In the September quarter, Nykaa had reported net profit of about ₹5 crore

బ్యూటీ, ఫ్యాషన్ ఉత్పత్తుల ఈ-రీటైలర్ అయిన నైకా మాతృ కంపెనీ ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ షేర్ ధర నాలుగు రోజుల్లో సుమారు 20 శాతం పడిపోయింది. గత వారం ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ పూర్తవడంతో ఈ పతనం ప్రారంభమైంది. గురువారం 4 శాతం పతనమై రూ. 171కి పడిపోయింది. నాలుగు రోజుల్లో షేర్లు 20 శాతం పతనమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా పరిశీలిస్తే.. లైట్ హౌజ్ ఇండియా ఫండ్ త్రీ లిమిటెడ్ నవంబరు 10వ తేదీన 96,89,240 షేర్లను రూ. 171 చొప్పున అమ్మేసింది. అలాగే నవంబరు 15న సెగంటీ ఇండియా మారిషస్ కంపెనీ 33,73,243 షేర్లను రూ. 199 చొప్పున 15వ తేదీన అమ్మేసింది.

ఇన్వెస్టర్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తరువాత స్టాక్స్ తరచుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని పతనమవుతుంటాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో లిమిటెడ్ జూలై మాసంలో ఇదే తరహాలో రికార్డు స్థాయి దిగువకు పడిపోయింది. నైకా గత ఏడాది నవంబరులో మార్కెట్లో లిస్టయింది. ప్రస్తుతం ఐపీఓ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి.

నైకా గ్రాస్ మర్కండైస్ వాల్యూ (జీఎంవీ) లేదా మొత్తం ఆర్డర్ల మానిటరీ వ్యాల్యూ 45 శాతం జంప్ అయి రూ. 2300 కోట్లకు చేరుకుంది. ఫ్యాషన్ బిజినెస్ జీఎంవీ 43 శాతం పెరగగా, బ్యూటీ, పర్సనర్ కేర్ బిజినెస్ 39 శాతానికి పెరిగింది.

నైకా స్టాక్స్ సహా టెక్, ఈ రీటైలర్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ విశ్లేషించారు. ప్రాథమిక-ఇన్వెస్టర్లకు సంబంధించిన లాకిన్ పీరియడ్ పూర్తవడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్ పెరిగిందని, అమ్మకాల ఒత్తిడి ఎదురైందని తెలిపారు. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆయా స్టాక్స్ ధరలో తీవ్రమైన అనిశ్చిత పరిస్తితులు నెలకొన్నాయని విశ్లేషించారు. అయితే దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడులను అందించే అవకాశం ఉన్నందున లాంగ్ టెర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారని వివరించారు. ఈ సెగ్మెంట్‌ను సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వివరించారు.

ఇక పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కూడా ఈరోజు 10 శాతం నష్టపోయింది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూపులోని ఓ యూనిట్ కంపెనీ నుంచి సుమారు 29.5 మిలియన్ షేర్లను అమ్మడానికి నిర్ణయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబరు త్రైమాసికంలో నైకా రూ. 5 కోట్ల నికర లాభాన్ని చూపింది. రెవెన్యూ 39 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది.