తెలుగు న్యూస్  /  Business  /  Want To Purchase A Car In This Diwali Season Find Offers On These Five Cars

diwali offers on cars: ఈ 5 కార్లపై దీపావళి ఆఫర్లు

HT Telugu Desk HT Telugu

13 October 2022, 16:03 IST

    • diwali offers on cars: ఈ దీపావళి పండక్కి కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఐదు కార్లపై ఆఫర్లు ఉన్నాయి చూడండి
మారుతీ సుజుకీ ఆల్టో కే 10
మారుతీ సుజుకీ ఆల్టో కే 10 (PTI)

మారుతీ సుజుకీ ఆల్టో కే 10

diwali offers on cars: ఈ దీపావళికి చిన్న కార్లపై చాలా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొత్త తరం మారుతీ ఆల్టో కే 10 నుంచి మొదలు ఇదివరకే మార్కెట్లో ఉన్న రెనాల్ట్ క్విడ్ వరకు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

పండగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకర్షించడానికి కార్ల తయారీ సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. పాత, కొత్త మోడళ్లపై డిస్కౌంట్లు అందిస్తాయి. రూ. 30 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్ అందించే కార్లను ఇక్కడ చూడండి.

మారుతీ సెలెరియో

మారుతీ సుజుకీ కొత్త తరం మోడల్ సెలెరియాపై గరిష్టంగా రూ. 59 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. పైగా ప్రయోజనాలన్నీ నగదు డిస్కౌంట్ రూపంలో అందిస్తోంది. నగదు డిస్కౌంట్ రూ. 40 వేల వరకు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 15 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4 వేల వరకు ఇస్తోంది.

మారుతీ స్విఫ్ట్

మారుతీ సుజుకీ నుంచి వచ్చిన మరో పాపులర్ హాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్. ఇది కూడా అత్యధికంగా డిస్కౌంట్‌తో వస్తున్న పండగ ఆఫర్లలో ఒకటి. రూ. 50 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 30 వేల విలువైన నగదు డిస్కౌంట్‌తో పాటు రూ. 15 వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి.

మారుతీ వాగన్‌ ఆర్

మారుతీ సుజుకీ నుంచి ఉన్న మరో పాపులర్ కార్ మారుతీ వాగన్ ఆర్. దీనిపై పండగ సీజన్‌లో రూ. 40 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది. రూ. 20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5 వేల కార్పొరేట్ డిస్కౌం్ లభిస్తాయి.

మారుతీ ఆల్టో కే10

ఈ సంవత్సరం ఆవిష్కృతమైన కొత్త మోడల్ ఇది. ఈ హాచ్‌బాక్ పై మారుతీ సుజుకీ రూ. 39 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 20 వేల క్యాష్ బెనిఫిట్, రూ. 15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4 వేల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు లభిస్తాయి.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్ కూడా పండగ సీజన్‌లో రూ. 35 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 15 వేల విలువైన క్యాష్ బెనిఫిట్, రూ. 15 వేల విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ బెనిఫిట్ ఇందులో ఉన్నాయి.

టాపిక్