తెలుగు న్యూస్  /  Business  /  Top 10 Selling Suv Cars List In October 2022 Nexon Tops

Top 10 SUVs in October: ఎస్‌యూవీ కార్లలో కింగ్ నెక్సాన్.. అక్టోబరులో టాప్ అదే

HT Telugu Desk HT Telugu

04 November 2022, 16:06 IST

    • Top 10 SUVs in October: కొద్ది నెలలు ఎస్‌యూవీ కార్లలో టాప్ పొజిషన్ మారుతీ న్యూజనరేషన్ బ్రెజాకు దక్కగా.. అక్టోబరులో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ తిరిగి మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
టాటా మోటార్స్ నుంచి నెక్సాన్
టాటా మోటార్స్ నుంచి నెక్సాన్

టాటా మోటార్స్ నుంచి నెక్సాన్

కార్ల సంస్థలన్నింటికీ అక్టోబరు మాసం శుభఫలితాలను ఇచ్చింది. విజయ దశమి, దీపావళి పండగ బాగా కలిసొచ్చింది. అన్ని సెగ్మెంట్లలోకెల్లా ఎస్‌యూవీ సెగ్మెంట్ నుంచే ప్రస్తుతం అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. అందువల్ల బాగా అమ్ముడయ్యే మోడల్ ఉన్న కార్ల కంపెనీ అమ్మకాల్లో టాప్ పొజిషన్‌లో నిలుస్తుంది.

ప్రస్తుతం నెక్సాన్ కార్ బాగా పాపులర్ అయ్యింది. అక్టోబరులో ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇండియా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా మారింది. మారుతీ బ్రెజా నుంచి అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది.

Tata Nexon: టాటా నెక్సాన్ మొదటి స్థానం

అక్టోబరు నెలలో టాటా మోటార్స్ నుంచి నెక్సాన్ కార్లు 13,767 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. అయితే సెప్టెంబరులో ఇంతకుమించి 14,518 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Hyundai creta: హ్యుందాయ్ క్రెటా రెండోస్థానం

హ్యుందాయ్ మోటార్స్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ స్థిరమైన అమ్మకాలతో అగ్రశ్రేణి ఎస్‌యూవీలో ఒకటిగా నిలిచింది. పటిష్టమైన అమ్మకాల కారణంగా ఇది అక్టోబరులో రెండోస్థానంలో నిలిచింది. ఈ కొరియన్ కార్ల కంపెనీ అక్టోబరులో 11,880 క్రెటా కార్లను అమ్మింది. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే రెట్టింపయ్యాయి. అయితే ఈ సెప్టెంబరులో 12,866 కార్లు అమ్ముడయ్యాయి.

Tata Punch: టాటా పంచ్ మూడో స్థానం

టాటా పంచ్ అమ్మకాలు ఇటీవల పుంజుకున్నాయి. ఇది లాంఛ్ అయ్యి ఏడాది కాలమైంది. ఈ అక్టోబరులో 10,982 కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబరులో 12,251 కార్లు అమ్ముడయ్యాయి. పటిష్టమైన భద్రత అందించే కారుగా పేరు సంపాదించింది.

Maruti Brezza: మారుతీ బ్రెజా

మారుతీ న్యూజనరేషన్ బ్రెజా ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో తొలిస్థానంలో నిలిచింది. అయితే అక్టోబరుకు వచ్చేసరికి నాలుగో స్థానానికి పరిమితమైంది. మొత్తం 9,941 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు నెలలో 15,445 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే అక్టోబరులో తగ్గాయి. సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్ కూడా ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

Kia Seltos: కియా సెల్టోస్

కియా కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ దాని బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. క్రెటాకు పోటీ ఇస్తోంది. అక్టోబరులో 9,777 కియా సెల్టోస్ కార్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబరులో కియా 11 వేల సెల్టోస్ కార్లు అమ్మింది.

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ నుంచి వెన్యూ మారుతీ బ్రెజాకు గట్టి పోటీనిస్తోంది. అయితే అక్టోబరులో 6వ స్థానానికి పడిపోయింది. సెప్టెంబరులో 11,033 వెన్యూ కార్లు అమ్మిన హ్యుందాయ్ అక్టోబరులో మాత్రం 8,108 కార్లు అమ్మింది.

Mahindra Bolero: మహీంద్రా బొలెరొ

కొత్తకొత్త మోడల్స్ చాలా వచ్చినప్పటికీ మహీంద్రా బొలెరొకు ప్రత్యేక స్థానం ఉంది. మహీంద్రా నుంచి బెస్ట్ ఎస్‌యూవీ సెల్లింగ్ మోడల్‌గా నిలుస్తోంది. అక్టోబరులో బొలెరొ కార్లు 8,772 కార్లు అమ్ముడ్యాయి. సెప్టెంబరులో 8,108 కార్లు అమ్ముడయ్యాయి.

Maruti Grand Vitara: మారుతీ గ్రాండ్ విటారా

మారుతీ నుంచి మరో ఎస్‌యూవీ గ్రాండ్ విటారా టాప్ 10 ఎస్‌యూవీ జాబితాలో కొత్తగా వచ్చి చేరింది. సెప్టెంబరులో లాంచ్ అయిన ఈ మోడల్ నుంచి 8,052 కార్లు అమ్ముడయ్యాయి. క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

Kia sonet: కియా సోనెట్

కియా మోటార్స్ నుంచి కియా సోనెట్ కూడా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. అయితే పోటీ దారులైన నెక్సాన్, బ్రెజా, వెన్యూ లతో పోలిస్తే అమ్మకాల పరుగులో కాస్త వెనకబడి ఉంది. అక్టోబరులో 7,614 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబరులో 9,291 కార్లు అమ్ముడయ్యాయి.

Mahindra Scorpio: మహీంద్రా స్కార్పియో

మహీంద్రా నుంచి స్కార్పియో టాప్ 10 ఎస్‌యూవీ కార్ల జాబితాలో నిలిచింది. అక్టోబరులో 7,438 స్కార్పియో కార్లను అమ్మింది.ఇందులో స్కార్పియో-ఎన్ కార్లు కూడా ఉన్నాయి. సెప్టెంబరు మాసంలో 9,536 కార్లు అమ్ముడయ్యాయి.