స్కోడా మిడ్ సైజ్ ఎస్‌యూవీ కుషాక్ మాంటే కార్లో ఎడిషన్ విడుదల-skoda drives in kushaq monte carlo edition with starting price of rs 15 99 lakh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  స్కోడా మిడ్ సైజ్ ఎస్‌యూవీ కుషాక్ మాంటే కార్లో ఎడిషన్ విడుదల

స్కోడా మిడ్ సైజ్ ఎస్‌యూవీ కుషాక్ మాంటే కార్లో ఎడిషన్ విడుదల

HT Telugu Desk HT Telugu
May 09, 2022 04:01 PM IST

న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా సోమవారం తన మిడిల్ సెగ్మెంట్ ఎస్‌యువీ కుషాక్‌లో మోంటే కార్లో ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంది.

<p>కుషాక్ మాంటేకార్లో ఎడిషన్</p>
కుషాక్ మాంటేకార్లో ఎడిషన్ (skoda)

కుషాక్ మాంటే కార్లో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రిమ్ 1 లీటర్ పెట్రోల్ వెర్షన్ ఇంజన్ ధర రూ. 15.99 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.69 లక్షలు.

అదేవిధంగా 1.5 లీటర్ ఇంజన్‌తో కూడిన మోంటే కార్లో ఎడిషన్ మాన్యువల్ ట్రిమ్ ధర రూ. 17.89 లక్షలు కాగా, సెవెన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రిమ్‌లో హైఎండ్ రేంజ్ రూ. 19.49 లక్షలుగా ఉంది.

స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ ‘మాంటే కార్లో ఎడిషన్ ప్రత్యేకమైన వీల్స్, సీట్లు, బ్లాక్ ఇంటీరియర్స్‌తో స్పోర్టినెస్ కలిగి ఉంది.’ అని చెప్పారు. స్కోడా ప్రస్తుతం దేశీయ విపణిలో నెలకు దాదాపు 2,500-3,000 యూనిట్ల మధ్య తరహా ఎస్‌యూవీని విక్రయిస్తోంది.

కుషాక్ మోంటే కార్లో 'టోర్నడో రెడ్', 'క్యాండీ వైట్' రంగులలో వస్తోంది. కుషాక్ మాంటే కార్లో 1.0 టీఎస్ఐ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఇటీవలే విడుదల చేసిన మోడల్ స్లావియా నెలకు దాదాపు 2,500-3,000 యూనిట్ల విక్రయాలతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని హోలిస్ పేర్కొన్నారు.

‘ప్రారంభించిన రెండో నెలలోనే మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో నంబర్ వన్‌గా నిలిచాం. అదే విధంగా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మూడవ స్థానంలో ఉంది. కాబట్టి రెండు కార్లు బాగా రాణిస్తున్నాయి..’ అని తెలిపారు. 

Whats_app_banner

టాపిక్