తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Markets: పాజిటివ్‍గా మొదలైన స్టాక్ మార్కెట్లు.. సూచీలు పైకి..

Stock Markets: పాజిటివ్‍గా మొదలైన స్టాక్ మార్కెట్లు.. సూచీలు పైకి..

24 November 2022, 9:19 IST

    • Stock market Today: భారత ఈక్విటీ మార్కెట్లు నేడు జోష్‍తో మొదలయ్యాయి. నిఫ్టీ, సెన్సెక్స్ లాభాలతో ఓపెన్ అయ్యాయి.
Stock Market: పాజిటివ్‍గా స్టాక్ మార్కెట్లు
Stock Market: పాజిటివ్‍గా స్టాక్ మార్కెట్లు

Stock Market: పాజిటివ్‍గా స్టాక్ మార్కెట్లు

Stock market Today: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలత కొనసాగింది. నేడు (నవంబర్ 24) స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ (Sensex) 137.24 పాయింట్లు బలపడి 61,647.82 పాయింట్లు వద్ద ట్రేడ్ అవుతోంది. 42.75 పాయింట్లు పెరిగిన నిఫ్టీ (Nifty 50) 18,310 పాయింట్ల వద్ద ఓపెన్ అయింది. రానున్న కాలంలో అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లను మరీ దూకుడుగా పెంచబోదన్న అంచనాలతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

లాభాలు.. నష్టాలు

టాటా కన్జ్యూమర్ ప్రొడక్షన్స్, హెచ్ పీసీఎల్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, బిర్లా సాఫ్ట్, ఐడీఎఫ్సీ, బలరాంపూర్ చిని.. స్టాక్ట్స్ నేడు ఎక్కువ లాభాలతో మొదలై సెషన్ ప్రారంభంలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. పవర్ ఫైనాన్స్, గ్లెన్ మార్క్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్కార్ట్ కుబోటా, ఎస్బీఐ కార్డ్, డిక్సన్ టెక్నాలజీ షేర్లు ఆరంభంలో ఎక్కువ నష్టాలను మూటగట్టుకొని టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.

Pre-Market session: ఎస్‍జీఎక్స్ నిఫ్టీ సానుకూలంగా ఉన్న నేపథ్యంలోనూ.. ప్రీ మార్కెట్ సెషన్‍లో నిఫ్టీ 58.85 పాయింట్లు బలపడి 18,326.10కు చేరింది. సెన్సెక్స్ కూడా 145.42 పాయింట్లు పెరిగి 61,656 వద్ద ప్రీ-ఓపెనింగ్ సెషన్‍లో స్థిరపడింది.

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు 15 పెసలు పెరిగి రూ.81.70కు చేరుకుంది.

లాభాల్లో అమెరికన్ మార్కెట్లు

వడ్డీ రేట్ల పెంపు తక్కువగా ఉంటుందని ఫెడరల్ రిజర్వ్ సమావేశం ద్వారా అంచనాలు రావటంతో అమెరికన్ మార్కెట్లు బుధవారం సానుకూలంగా స్పందించాయి. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 95.96 పాయింట్లు అధికమై రూ.34,194.06 వద్ద స్థిరపడింది. నాస్‍డాక్ కంపోజైట్ యావరేజ్ 110.91 పెరిగి 11,285.32కు చేరింది. 23.68 పాయింట్లు బలపడిన ఎస్ అండే పీ 500 సూచీ 4,027.26కు చేరింది.

ఆసియా మార్కెట్లు కూడా గురువారం గ్రీన్‍లోనే ఓపెన్ అయ్యాయి. కొరియన్ సూచీ కోస్పీతో ఆస్ట్రేలియా, జపాన్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి .

అమ్మకంవైపే ఎఫ్ఐఐలు

భారత మార్కెట్లలో గురువారం రోజున కూడా ఫారిన్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) అమ్మకం వైపే మొగ్గుచూపారు. మొత్తంగా రూ.789.86 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. డొమెస్టిక్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐఎస్) రూ.413.75 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారని ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది.

అప్పటికి నిఫ్టీ@20,500!

2023 నాటికి నిఫ్టీ 50 సూచీ 20,500 పాయింట్లకు చేరుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ప్రస్తుతం నుంచి ఇది 12 శాతం వృద్ధి. 2023లోనూ భారత ఈక్విటీ గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదని ఈ బ్రోకరేజ్ సంస్థ అభిప్రాయపడింది.

టాపిక్