తెలుగు న్యూస్  /  Business  /  Stock Markets Opens In Positive Note Nifty Sensex In Green

Stock Market: ఫ్లాట్‍గా మొదలైన స్టాక్ మార్కెట్లు

01 June 2023, 9:18 IST

    • Stock Market: భారత స్టాక్ మార్కెట్లు సూచీలు నేడు ఫ్లాట్‍గా ఆరంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత ఉంది.  
Stock Market: ప్రతికూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు
Stock Market: ప్రతికూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock Market: ప్రతికూలంగా మొదలైన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‍గా ప్రారంభం అయ్యాయి. కిందటి సెషన్‍లో నష్టపోయిన భారత మార్కెట్లు నేడు (జూన్ 1, గురువారం) ఊగిసలాటతో ఓపెన్ అయ్యాయి. సెషన్ ప్రారంభంలో జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 9.85 పాయింట్లు పెరిగి 18,544.25 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 10.78 పాయింట్లు బలపడి 62,633.02 వద్ద కొనసాగుతోంది. సెషన్ ఓపెనింగ్‍లో సూచీలు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ఆసియా మార్కెట్లు నేడు కూడా మిశ్రమంగా సాగుతున్నాయి. మరోవైపు, అమెరికా రుణ గరిష్ట పరిమితి పెంపు బిల్లుకు హౌస్‍లో ఆమోదం లభించింది. ఇది మార్కెట్లకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Google layoffs 2024 : పైథాన్​ టీమ్​ మొత్తాన్ని తీసేసిన గూగూల్​! వేరే వాళ్లు చౌకగా వస్తున్నారని..

8th Pay Commission : 8వ పే కమిషన్​పై బిగ్​ అప్డేట్​.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​!

Amazon Great Summer Sale 2024 : అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్లు

Tata Punch : టాటా పంచ్​ ఈవీ- టాటా పంచ్​ పెట్రోల్​- టాటా పంచ్​ సీఎన్​జీ.. ఏది కొనాలి?

లాభాలు, నష్టాలు

సెషన్ ప్రారంభంలో నిఫ్టీ 50 సూచీలో అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో స్టాక్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. కోల్ ఇండియా, కొటాక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ కార్ప్, బ్రిటానియా స్టాక్స్ ఓపెనింగ్‍లో నష్టపోయి టాప్ లూజర్లుగా ట్రేడ్ అవుతున్నాయి.

నష్టాల్లో అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లలో బుధవారం ఒడిదొడుకులు కొనసాగాయి. హౌస్‍ ముందు గరిష్ట రుణ పరిమితి బిల్లు వచ్చే ముందుకు అమెరికా మార్కెట్లు నష్టాలను చూశాయి. బుధవారం సెషన్‍లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 134.51 పాయింట్లను కోల్పోయి 32,908.27 వద్ధ స్థిరపడగా.. నాస్‍డాక్ కంపోజైట్ 82.14 పాయింట్లు క్షీణించి 12,935.29 వద్ద ముగిసింది. ఎస్&పీ 500 ఇండెక్స్ 25.69 పాయింట్లు పడిపోయి 4,179.83 వద్దకు చేరింది.

మరోవైపు ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ సూచీలు నిక్కీ, టాపిక్స్ స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సౌత్ కొరియా సూచీలు కోస్పీ, కోస్డాక్ సూచీలు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‍లో ప్రతికూలంగా ఉన్నాయి.

క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‍లో మరింత తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రస్తుతం 72.66 డాలర్ల వద్ద సాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.41 వద్ద ఉంది.