తెలుగు న్యూస్  /  Business  /  Stock Markets Opens In Negative Note Nifty Sensex In Losses

Stock Market: ఫ్లాట్‍గా స్టాక్ మార్కెట్లు ప్రారంభం

25 May 2023, 9:18 IST

    • Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్‍గా మొదలయ్యాయి. ఆరంభంలో నిఫ్టీ, సెన్సెక్స్ ఊగిసలాటలో ఉన్నాయి.
Stock Market: ప్రతికూలంగా స్టాక్ మార్కెట్లు ప్రారంభం
Stock Market: ప్రతికూలంగా స్టాక్ మార్కెట్లు ప్రారంభం

Stock Market: ప్రతికూలంగా స్టాక్ మార్కెట్లు ప్రారంభం

Stock Market: కిందటి సెషన్లో నష్టాలను చూసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు (మే 25, గురువారం) ఫ్లాట్‍గా షూరూ అయ్యాయి. సెషన్ ఆరంభంలో జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15.50 పాయింట్లు క్షీణించి 18,269.90 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 46.62 పాయింట్ల నష్టంతో 61,727.16 వద్ద కొనసాగుతోంది. ఆరంభంలో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనత కొనసాగింది. ఇది భారత మార్కెట్లపై కూడా పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ఓపెన్ అయ్యాయి.

లాభాలు, నష్టాలు

సెషన్ ప్రారంభంలో నిఫ్టీ 50లో బ్రిటానియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్, హిందాల్కో, సన్ ఫార్మా, ఓఎన్‍జీసీ, ఇండస్‍ఇండ్ బ్యాంక్, హెచ్‍సీఎల్ టెక్ టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.

నేటి రిజల్ట్స్

జీ ఎంటర్‌టైన్‍మెంట్ ఎంటర్‌ప్రైజెస్, వొడాఫోన్ ఐడియా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏఐఏ ఇంజినీరింగ్, భారత్ డైనమిక్స్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇమామీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ సహా మరిన్ని సంస్థలు నేడు 2022-23 ఆర్థిక సంవత్సర నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

అమెరికా మార్కెట్లు

అమెరికా మార్కెట్లలో ప్రతికూలత కొనసాగుతూనే ఉంది. బుధవారం సెషన్‍లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇండెక్స్ 255.59 పాయింట్లు కోల్పోయి 32,799.92కు పడిపోగా.. ఎస్&పీ 500 సూచీ 30.34 నష్టంతో 4,115.24 వద్ద స్థిరపడింది. నాస్‍డాక్ కంపోజైట్ 76.09 పాయింట్లు పడిపోయి 12,484.16 వద్ద ముగిసింది. అమెరిగా గరిష్ట రుణ పరిమితి గురించి ఇంకా ఉత్కంఠ నెలకొంది. అమెరకా ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. కాగా, బుధవారం సెషన్‍లో యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలనే మూటగట్టుకున్నాయి.

ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ఓపెన్ అయ్యాయి. దక్షిణ కొరియా సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్‍లో నిక్కీ లాభంలో ట్రేడ్ అవుతుండగా.. టాపిక్స్ మాత్రం నష్టంతో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా బలహీనంగా ఓపెన్ అయ్యాయి. హాంకాంగ్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది.

డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.82.74 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‍లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 78.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.