తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks Market News Today: సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్.. లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్

Stocks Market News Today: సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్.. లాభాల్లో నిఫ్టీ, సెన్సెక్స్

22 March 2023, 9:16 IST

  • Stocks Market News Today: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నేడు సానుకూలంగా ఓపెన్ అయ్యాయి. అమెరికా సహా ఆసియా మార్కెట్లలో మళ్లీ జోష్ నెలకొంది.

Stocks Market News Today: సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్
Stocks Market News Today: సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్

Stocks Market News Today: సానుకూలంగా మొదలైన స్టాక్ మార్కెట్

Stocks Market News Today: అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉండటంతో భారత స్టాక్ మార్కెట్లు నేడు (మార్చి 22, బుధవారం) లాభాలతో మొదలయ్యాయి. సెషన్ ఓపెనింగ్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ 69.85 పాయింట్లు పెరిగి 17,177.35 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 233.14 పాయింట్లు అధికమై 58,307.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లలో జోష్‍తో నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. కీలకమైన అమెరికన్ ఫెడ్ వడ్డీ రేటు ప్రకటన ముందు మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.

లాభాలు, నష్టాలు

Top Gainers, Top Losers: నేటి సెషన్ ఓపెనింగ్‍లో మ్యాక్స్ ఫైనాన్షియల్, కాన్‍ఫోర్జ్, ఎస్‍బీఐ కార్డ్స్, ఎస్‍బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బిర్లా సాఫ్ట్, ఎల్టీఐ మైండ్‍ట్రీ స్టాక్స్ టాప్ గెయినర్లుగా ట్రేడ్ అవుతున్నాయి. ఆరంభంలో కోల్ ఇండియా, గెయిల్, పిరమల్ ఎంటర్ ప్రైజెస్, పీవీఆర్, ఐటీసీ స్టాక్స్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.

అమెరికా మార్కెట్లలో జోష్

US Markets: బ్యాంకింగ్ రంగ సంక్షోభం సద్దుమణుగుతుందన్న ఆశ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల కంటే ఎక్కువ పెంచదన్న అంచనాతో అమెరికా మార్కెట్లు మంగళవారం సెషన్‍లో లాభపడ్డాయి. నాస్‍డాక్ కంపోజైట్ 184.57 పాయింట్లు బలపడి 11,860.11 వద్దకు చేరింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 316.02 పాయింట్లు ఎగిసి 32,560.60కు పెరిగింది. ఎస్&పీ 500 సూచీ 51.3 పాయింట్లు బలపడి 4,002.87కు ఎగబాకింది.

ఆసియా మార్కెట్లు కూడా..

యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు ప్రకటన ముంగిట ఆసియా మార్కెట్లు కూడా నేడు లాభాలతో ఓపెన్ అయ్యాయి. జపాన్ సూచీ నిక్కీ ఒకటిన్నర శాతానికి పైగా లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. టాపిక్స్ కూడా జోష్‍లో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా మార్కెట్లు కూడా గ్రీన్‍లో ఉన్నాయి.

కాస్త పెరిగిన క్రూడ్

ఇటీవల వరుసగా పతనమవుతూ వచ్చిన క్రూడ్ ఆయిల్ ధర కాస్త పెరిగింది. గత 24 గంటల్లో 2 శాతం వరకు పెరుగగా.. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎల్‍నినో ప్రభావం నుంచి బయటపడితే 2024 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో 5 నుంచి 5.6 శాతం మధ్యే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసింది.