తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Today 08 March 2023 Know Sensex Nifty Performance

Stock Market today: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

HT Telugu Desk HT Telugu

08 March 2023, 9:20 IST

    • Stock Market today: బుధవారం స్టాక్ మార్కెట్లు ఆరంభంలో నష్టాల బాట పట్టాయి.
సోమవారం లాభాలు చూసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం లాభాలు చూసిన స్టాక్ మార్కెట్లు (PTI)

సోమవారం లాభాలు చూసిన స్టాక్ మార్కెట్లు

Stock Market today: సెన్సెక్స్ బుధవారం నష్టాల్లో ప్రారంభమైంది. సోమవారం నాటి సెషన్‌లో 60 వేల స్థాయిని తిరిగి పొందిన సెన్సెక్స్ బుధవారం ఉదయం ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో 308 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ సోమవారం 117.10 పాయింట్లు లాభపడగా, బుధవారం ప్రిమార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో 45 పాయింట్ల మేర నష్టపోయింది. సోమవారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.45 శాతం, టాటా మోటార్స్ 2.92 శాతం, ఓఎన్‌జిసి 2.5 శాతం లాభపడ్డాయి. లాభపడిన ఇతర స్టాక్స్‌లో ఓఎన్‌జిసి, ఆయిల్ ఇండియా, ఏజిస్ లాజిస్టిక్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నాయి.

బుధవారం మార్కెట్లు తెరుచుకోగానే సెన్సెక్స్, నిఫ్టీ నష్టపోయాయి. ఉదయం 9.16 సమయంలో సెన్సెక్స్301 నష్టపోయి 59,923 పాయింట్ల వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు కోల్పోయి 17,610 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.

నేటి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

బుధవారం స్టాక్ మార్కెట్లో మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, లార్సెన్, హెచ్‌యూఎల్ తదితర స్టాక్స్ లాభాలు గడించిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.

బుధవారం స్టాక్ మార్కెట్లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా తదితర స్టాక్స్ నష్టాలు పొందిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి.

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిప్టీ ఫిన్ సర్వీస్, నిఫ్టీ ఫార్మాన, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ తదితర రంగాల స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.

టాపిక్