తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 30th May 2023 Sensex And Nifty Opens On A Flat Note

Stock market news today : ఫ్లాట్​గా దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. నిఫ్టీ 20 పాయింట్లు డౌన్​

Sharath Chitturi HT Telugu

30 May 2023, 9:16 IST

    • Stock market news today : ఇండియా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగిశాయి.
ఇండియా స్టాక్​ మార్కెట్​..
ఇండియా స్టాక్​ మార్కెట్​.. (MINT_PRINT)

ఇండియా స్టాక్​ మార్కెట్​..

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 24పాయింట్లు కోల్పోయి 62,822 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 20 పాయింట్ల నష్టంతో 18,580 వద్ద కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Netflix with Airtel: ఈ ఎయిర్ టెల్ ప్రి పెయిడ్ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఫ్రీ

Ampere Nexus e-scooter: రివర్స్ మోడ్, 136 కిమీ రేంజ్ తో భారత్ లోకి యాంపియర్ నెక్సస్ ఈ-స్కూటర్

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 99 పాయింట్లు పెరిగి 18,598 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 344 పాయింట్లు వృద్ధిచెంది 62,846 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 44,312 వద్దకు చేరింది. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 62,836- 18,607 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ చాలా బుల్లిష్​గా ఉంది!

స్టాక్స్​ టు బై..

లుపిన్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 778, టార్గెట్​ రూ. 848

బ్లూ స్టార్​​:- బై రూ. 1471.25, స్టాప్​ లాస్​ రూ. 1425, టార్గెట్​ రూ. 1560

Tata steel share price target : టాటా స్టీల్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్ (రూ.108)​, స్టాప్​ లాస్​ రూ. 103, టార్గెట్​ రూ. 117

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

టైటాన్​, ఎం అండ్​ ఎం, పవర్​గ్రిడ్​, మారుతీ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టెక్​ఎం, టాటా మోటార్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:- Q4 Results this week: ఈ వారం ఫలితాలను వెల్లడించనున్న ముఖ్యమైన కంపెనీలు ఇవే.. అదానీ పోర్ట్స్, ఐఆర్‌సీటీసీ సహా మరిన్ని..

అంతర్జాతీయ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా లాభపడ్డాయి! డౌ జోన్స్​ 1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.3శాతం, నాస్​డాక్​ 2.19శాతం మేర వృద్ధిచెందాయి.

ఆసియా మార్కెట్​లు ఫ్లాట్​గా ట్రేడ్​ అవుతున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1758.16కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.