Stocks to buy today : ఈ రూ. 108 స్టాక్​ ఇప్పుడు కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-day trading guide for today six stocks to buy or sell on tuesday may 30 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Day Trading Guide For Today: Six Stocks To Buy Or Sell On Tuesday May 30 2023

Stocks to buy today : ఈ రూ. 108 స్టాక్​ ఇప్పుడు కొంటే.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
May 30, 2023 08:09 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితుల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 99 పాయింట్లు పెరిగి 18,598 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 344 పాయింట్లు వృద్ధిచెంది 62,846 వద్ద ముగిసింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 44,312 వద్దకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ చాలా బుల్లిష్​గా ఉంది!

"బ్యాంకింగ్​తో పాటు ఇతర హెవీవెయిట్​ స్టాక్స్​లో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. నిఫ్టీలో ఉన్న అప్​ట్రెండ్​ కొనసాగుతుందని ఆశిస్తున్నాము. రానున్న రోజుల్లో నిఫ్టీ.. లైఫ్​ టైమ్​ హైని తాకొచ్చు," అని మోతీలాల్​ ఓస్వాల్​లకు చెందిన రీటైల్​ రీసెర్చ్​ హెడ్​ సిద్ధార్త ఖేంక తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1758.16కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను పాజిటివ్​గా ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా లాభపడ్డాయి! డౌ జోన్స్​ 1శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.3శాతం, నాస్​డాక్​ 2.19శాతం మేర వృద్ధిచెందాయి.

స్టాక్స్​ టు బై..

లుపిన్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 778, టార్గెట్​ రూ. 848

బ్లూ స్టార్​​:- బై రూ. 1471.25, స్టాప్​ లాస్​ రూ. 1425, టార్గెట్​ రూ. 1560

Tata steel share price target : టాటా స్టీల్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్ (రూ.108)​, స్టాప్​ లాస్​ రూ. 103, టార్గెట్​ రూ. 117

ఎస్​బీఐ (స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా)​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 570, టార్గెట్​ రూ. 630

Tata motors share price target : టాటా మోటార్స్​​:- బై రూ. 522, స్టాప్​ లాస్​ రూ. 512, టార్గెట్​ రూ. 535

బయోకాన్​​:- బై రూ. 242, స్టాప్​ లాస్​ రూ. 234, టార్గెట్​ రూ. 252

(గమనిక​:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునేముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం