తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy A54 5g Samsung Galaxy A34 5g Launch Confirmed On March 16 Know Expected Specifications Price Details

Samsung: సామ్‍సంగ్ నుంచి రెండు నయా 5జీ మొబైళ్లు వచ్చేస్తున్నాయి: లాంచ్ డేట్ ఫిక్స్

11 March 2023, 7:12 IST

    • Samsung: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G), సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ ఫోన్‍లకు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే బయటికి వచ్చాయి.
Samsung: సామ్‍సంగ్ నుంచి రెండు నయా 5జీ మొబైళ్లు వచ్చేస్తున్నాయి (Photo: Samsung)
Samsung: సామ్‍సంగ్ నుంచి రెండు నయా 5జీ మొబైళ్లు వచ్చేస్తున్నాయి (Photo: Samsung)

Samsung: సామ్‍సంగ్ నుంచి రెండు నయా 5జీ మొబైళ్లు వచ్చేస్తున్నాయి (Photo: Samsung)

Samsung New 5G Phones: పాపులర్ ఏ సిరీస్‍లో మరో రెండు స్మార్ట్ ఫోన్‍లను ప్రముఖ సంస్థ సామ్‍సంగ్ (Samsung) తీసుకొస్తోంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G), సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) మొబైళ్లు భారత మార్కెట్‍లో అడుగుపెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి లాంచ్ డేట్‍ను కూడా సామ్‍సంగ్ అధికారికంగా వెల్లడించింది. మార్చి 16న ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. చాలా కాలంగా ఈ ఫోన్‍లకు సంబంధించి లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విడుదలకు సంబంధించి సామ్‍సంగ్ అఫీషియల్‍గా టీజ్ చేసింది. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‍తో ఈ గెలాక్సీ ఏ54 5జీ, గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‍లను తీసుకురానున్నట్టు సామ్‍సంగ్ పేర్కొంది. వివరాలు ఇవే.

లాంచ్ వివరాలు

Samsung Galaxy A54 5G, Galaxy A34 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మొబైళ్లు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‍లో విడుదల కానున్నాయి. ఈ మొబైళ్లకు సంబంధించి ఓ పేజీని అధికారిక వెబ్‍సైట్‍లో అమెజాన్ క్రియేట్ చేసింది. డిజైన్‍ను టీజ్ చేస్తోంది. కాగా ఈ మొబైళ్లకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్‍ల ద్వారా బయటికి వచ్చాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ (Samsung Galaxy A54 5G) ఫోన్.. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 6.4 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో వస్తుందని తెలుస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఈ మొబైల్ వెనుక ఉంటాయని అంచనా. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని రిపోర్టులు వచ్చాయి. ఇక ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం.

ఇక, సామ్‍సంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్‌తో రానుంది. ఈ రెండు ఫోన్లు ఐపీ67 రేటింగ్‍ను కలిగి ఉంటాయి.

గ్లోబల్‍గా సామ్‍సంగ్ గెలాక్సీ ఏ54 5జీ ప్రారంభ ధర 519 యూరోలు (సుమారు రూ.45,400), గెలాక్సీ ఏ34 5జీ ధర ర.419 యూరోలు (సుమారు రూ.36,600)గా ఉంటుందని టిప్‍స్టర్ స్నూపీ టెక్ వెల్లడించింది. అయితే ఇండియాలో ధరలు వీటికంటే కాస్త తక్కువగానే ఉంటాయని అంచనా.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఏ సిరీస్‍లో గెలాక్సీ ఏ14 5జీని సామ్‍సంగ్ తీసుకొచ్చింది. 6.6 ఇంచుల ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఎగ్జినోస్ 1330 ప్రాససెర్, 5000mAh బ్యాటరీని ఈ మొబైల్ కలిగి ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర ప్రస్తుతం రూ.16,499గా ఉంది.